News February 13, 2025

ఉంగుటూరులో బర్డ్ ఫ్లూ

image

బర్డ్ ఫ్లూపై ఏలూరు కలెక్టర్ వెట్రి సెల్వి కీలక ప్రకటన చేశారు. ఉంగుటూరు(M) బాదంపూడిలోని ఓ పౌల్ట్రీ ఫారంలో బర్డ్ ఫ్లూ నిర్ధారణైనట్లు తెలిపారు. దీంతో బాదంపూడి పౌల్ట్రీ నుంచి కిలీమీటురు పరిధి వరకు రెడ్ జోన్, పది. కి.మీ పరిధిని సర్వేసెన్స్ జోన్ గా ప్రకటించినట్లు తెలిపారు.

Similar News

News November 28, 2025

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు 3,000 మంది ప్రముఖులు

image

ఉజ్వల తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు ప్రపంచవ్యాప్తంగా 3,000 మంది ప్రముఖులను తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానించింది. మాజీ బ్రిటన్ ప్రధాని టోనీ బ్లేర్, యుఏఈ రాజ కుటుంబ సభ్యుడు షేక్ తారిక్ అల్ ఖాసిమీ, డాయిచ్ బోర్స్ గ్రూప్ హెడ్ లుడ్విగ్ హెయిన్జెల్మాన్‌తో పాటు ప్రముఖ టెక్ కంపెనీల సీఈవోలు, పెట్టుబడిదారులు, స్టార్టప్ ఫౌండర్లు హాజరుకానున్నారు.

News November 28, 2025

గుంటూరులో పోలీస్ సిబ్బంది గ్రీవెన్స్ డే

image

గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన పోలీస్ సిబ్బంది గ్రీవెన్స్ డేలో ఎస్పీ వకుల్ జిందాల్ పాల్గొన్నారు. మొత్తం 15 వినతులు స్వీకరించి, వ్యక్తిగత, సర్వీసు, బదిలీ, ఇతర పరిపాలనా సమస్యల పరిష్కారం కోసం సంబంధిత అధికారులను ఆదేశించారు. సిబ్బంది సంక్షేమం పోలీస్ శాఖకు ప్రాధాన్యం అని, భయపడకుండా సమస్యలను నేరుగా తెలియజేయాలని ఆయన సూచించారు.

News November 28, 2025

పెద్దపల్లిలో దివ్యాంగుల జిల్లా స్థాయి క్రీడలు

image

పెద్దపల్లి కలెక్టరేట్ పరేడ్‌గ్రౌండ్‌లో దివ్యాంగుల కోసం జిల్లా స్థాయి క్రీడలను ఘనంగా నిర్వహించారు. అదనపు కలెక్టర్ వేణు, ఎఫ్ ఆర్ ఓ స్వర్ణలత, డీడబ్ల్యూఓ ఇంచార్జ్ కవిత, రామగుండం సీడీపీఓ అలేఖ్య పటేల్ తదితర అధికారులు ప్రారంభించారు. చెస్, క్యారమ్స్, జావెలిన్, రన్నింగ్, షాట్‌పుట్ విభాగాల్లో 300 మంది వికలాంగులు ఉత్సాహంగా పాల్గొన్నారు. డబ్ల్యూసీడీ & ఎస్సీ శాఖ సమన్వయంతో కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.