News February 13, 2025

ఉంగుటూరులో బర్డ్ ఫ్లూ

image

బర్డ్ ఫ్లూపై ఏలూరు కలెక్టర్ వెట్రి సెల్వి కీలక ప్రకటన చేశారు. ఉంగుటూరు(M) బాదంపూడిలోని ఓ పౌల్ట్రీ ఫారంలో బర్డ్ ఫ్లూ నిర్ధారణైనట్లు తెలిపారు. దీంతో బాదంపూడి పౌల్ట్రీ నుంచి కిలీమీటురు పరిధి వరకు రెడ్ జోన్, పది. కి.మీ పరిధిని సర్వేసెన్స్ జోన్ గా ప్రకటించినట్లు తెలిపారు.

Similar News

News April 22, 2025

‘ప్రభుత్వ పాఠశాలల్లో సుశిక్షితులైన ఉపాధ్యాయులచే విద్య’

image

ప్రభుత్వ పాఠశాలల్లో సుశిక్షితులైన ఉపాధ్యాయులచే విద్యను నేర్చుకుని మంచి ప్రయోజకులు కావాలని జిల్లా కలెక్టర్ నాగరాణి అన్నారు. సోమవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో గోడ పత్రికను ఆవిష్కరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా బోధనపై శిక్షణ పొందిన ఉపాధ్యాయులు మాత్రమే ఉంటారని, నిర్ణీత విద్య అర్హతలతోపాటు పోటీ పరీక్షలలో అర్హత సాధిస్తేనే ఉపాధ్యాయులుగా పాఠశాలలో నియమించడం జరుగుతుందన్న విషయం అందరికీ తెలిసిందన్నారు.

News April 21, 2025

ప.గో: పీజీఆర్ఎస్‌కు 42 ఫిర్యాదులు

image

పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో అర్జీదారుల నుంచి వచ్చిన ఫిర్యాదులను నిర్దేశించిన గడువులోగా పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను నరసాపురం ఆర్డీఓ దాసిరాజు ఆదేశించారు. సోమవారం నరసాపురం సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల వ్యవస్థ కార్యక్రమంలో రెవెన్యూ డివిజన్ పరిధిలో 42 ఫిర్యాదులు అర్జీదారుల నుంచి స్వీకరించినట్లు ఆయన పేర్కొన్నారు. 

News April 21, 2025

ప.గో: పోలీస్ శాఖ పీజీ ఆర్ఎస్‌కు 23 అర్జీలు

image

ప.గో జిల్లా పాలకోడేరు మండలం గొల్లలకోడేరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి పాల్గొని ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పీజీఆర్ఎస్‌కు 23 ఫిర్యాదులు వచ్చాయని అన్నారు. సంబంధిత పోలీస్ స్టేషన్లకు పంపించి వాటి పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు.

error: Content is protected !!