News February 11, 2025

ఉంగుటూరు : రైలు పట్టాలపై దంపతుల ఆత్మహత్య

image

ఉంగుటూరు రైల్వే స్టేషన్ పరిధిలో వృద్ధ దంపతులు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. అప్పులు బాధ వల్లనే ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. ఘటనా స్థలంలో దొరికిన ఫోన్ ఆధారంగా వారు పెంటపాడు మండలానికి చెందిన వారుగా తెలుస్తోంది. ప్రమాదంలో మృతదేహాలు ముక్కలు ముక్కలుగా పడి ఉన్నాయి. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Similar News

News December 7, 2025

స్మృతి మంధాన పెళ్లి రద్దు.. ఏం జరిగింది?

image

తన ప్రియుడు పలాశ్ ముచ్చల్‌తో నిశ్చితార్థం జరిగినట్లు స్మృతి మంధాన నవంబర్ 20న ప్రకటించారు. అదే నెల 23న పెళ్లి జరగాల్సి ఉండగా, స్మృతి తండ్రికి గుండెపోటు రావడంతో చివరి నిమిషంలో పెళ్లి ఆగిపోయింది. ఆమె ప్రియుడు కూడా అస్వస్థతతో ఆస్పత్రిలో చేరాడు. ఆ తర్వాత అతడు వేరే అమ్మాయితో చాటింగ్ చేసినట్లు ఉన్న స్క్రీన్ షాట్లు వైరలయ్యాయి. పెళ్లి రద్దయినట్లు స్మృతి తాజాగా <<18495850>>ప్రకటించారు<<>>. అయితే కారణాన్ని వెల్లడించలేదు.

News December 7, 2025

సికింద్రాబాద్ పేరెలా వచ్చిందంటే?

image

సికింద్రాబాద్ పేరు వెనుక ఓ చరిత్ర దాగి ఉంది. 1798లో 2వ నిజాం అలీఖాన్ బ్రిటిషర్లతో ‘సైన్య సహకార ఒప్పందం’ కుదుర్చుకున్నారు. దీని ప్రకారం బ్రిటిష్ సైన్యం నిజాంకు రక్షణగా ఉంటుంది. వారి కోసం కంటోన్మెంట్ ఏర్పాటు చేశారు. కాలక్రమేణా బ్రిటిష్ సైన్యం విస్తరించి, వారి ప్రభావం పెరిగింది. దానిని తగ్గించేందుకు 3వ నిజాం సికిందర్ జా 1806లో ‘ఉలుమ్‌’ అనే ప్రాంతాన్ని ‘సికింద్రాబాద్’గా మార్చుతూ ఫర్మానా జారీ చేశారు.

News December 7, 2025

ఆదిలాబాద్: ఖర్చు లెక్క తప్పితే అంతే..!

image

ఎన్నికల్లో అక్రమ ఖర్చుకు అడ్డుకట్ట వేసేందుకు ఎన్నికల సంఘం కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. అభ్యర్థులు తమ నామినేషన్ల నుంచి చేసిన ఖర్చు వివరాలను సమర్పించాలి. ఆదిలాబాద్ జిల్లాలో పరిమితి మించిన 2019లో 235 మందిపై కేసు నమోదుకు ఈసీ ఆదేశించింది. ఈసారి కూడా అభ్యర్థుల ప్రచార వివరాలు ఖర్చులను ఎన్నికల సంఘానికి సమర్పించాల్సి ఉంటుంది. ఎక్కడ ఖర్చు మితిమీరిన చర్యలు తీసుకుంటామని ఎన్నికల అధికారులు హెచ్చరిస్తున్నారు.