News June 27, 2024
ఉంగుటూరు: రోడ్డు ప్రమాదంలో TDP మహిళా నేత మృతి

ఉంగుటూరు టీడీపీ మండల అధ్యక్షురాలు రమ్యకృష్ణ బుధవారం షిరిడీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. 2024 ఎన్నికల్లో చంద్రబాబు సీఎం అయితే షిరిడీ వస్తానని ఆమె మొక్కుకున్నారు. ఆ మేరకు మొక్కులు తీర్చుకొని తిరిగి బయలుదేరిన సమయంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మహిళా నేత మృతిపై చంద్రబాబు సంతాపం వ్యక్తం చేశారు.
Similar News
News February 11, 2025
గోదావరి జిల్లాల నుంచి వచ్చే చికెన్ తీసుకోవద్దు: కృష్ణా కలెక్టర్

ఉభయ గోదావరి జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాధి ప్రబలిన నేపథ్యంలో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీ కోరారు. జిల్లాకు బర్డ్ ఫ్లూ వ్యాపించకుండా తీసుకోవల్సిన చర్యలపై పలు శాఖల అధికారులతో కలెక్టర్ మంగళవారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల నుంచి వచ్చే కోడి మాంసం, కోడి గుడ్లను తీసుకోవద్దన్నారు. జిల్లా సరిహద్దుల వద్ద గట్టి నిఘా పెట్టామన్నారు.
News February 11, 2025
గన్నవరం: మాయమాటలతో బాలికను లోబర్చుకున్న ఆటో డ్రైవర్

ఇంటర్ చదివే విద్యార్థిని(మైనర్ బాలిక)ని రోజూ తన ఆటోలో కాలేజీకి తీసుకువెళ్లే ఆటో డ్రైవర్ మాయ మాటలతో లోబర్చుకుని గర్భిణిని చేసిన ఘటన గన్నవరం మండలంలో చోటు చేసుకుంది. దీనిపై తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు సాంబయ్య అనే ఆటో డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోక్సో కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు. వైద్య పరీక్షల నిమిత్తం బాలికను ఆస్పత్రికి తరలించారు.
News February 11, 2025
గన్నవరం TDP ఆఫీస్‌పై దాడి కేసులో బిగ్ ట్విస్ట్..

గన్నవరం TDP ఆఫీసుపై దాడి కేసులో ఫిర్యాదుదారుడైన సత్యవర్థన్ ఈ కేసుతో తనకు ఎటువంటి సంబంధం లేదని న్యాయాధికారికి సోమవారం వాంగ్మూలం అందజేశారు. వైసీపీ హయాంలో TDP ఆఫీసుపై ఈ దాడి జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక TDP ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేస్తున్న సత్యవర్థన్ ఫిర్యాదుతో పోలీసులు కేసు పెట్టారు. అయితే దాడి సమయంలో తాను అక్కడ లేనని, TDP నేతలు బలవంతంగా కేసు పెట్టించారని అతను ఆరోపించాడు.