News February 7, 2025
ఉంగుటూరు: రోడ్డు ప్రమాద మృతులు కృష్ణా జిల్లా వాసులు

ఉంగుటూరు మండలం నాచుగుంట వద్ద జాతీయ రహదారిపై రాత్రి జరిగిన <<15374910>>రోడ్డు ప్రమాదంలో<<>> ఇద్దరు చనిపోయిన సంగతి విదితమే. మృతులు కృష్ణా(D) బాపులపాడు మండలం ఆరుగొలనుకు చెందిన దేవ మందిరం, విజయ్ బాబుగా గుర్తించారు. రెక్కాడితే కానీ డొక్కాడని ఆ కుటుంబాల్లో వీరి మరణం తీవ్ర విషాదాన్ని నింపింది. దేవ మందిరానికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. విజయ్‌బాబుకి భార్య, ఐటీఐ చదివే కుమారుడు, టెన్త్ చదువుతున్న కుమార్తె ఉన్నారు.
Similar News
News March 28, 2025
వడలిలో మందాలమ్మని దర్శించుకున్న కోర్ట్ చిత్ర నటుడు

వడలి గ్రామ దేవత మందాలమ్మను కోర్ట్ చిత్ర నటుడు శ్రీనివాస్ భోగి రెడ్డి గురువారం దర్శించుకున్నారు. కోర్టు చిత్రంలో శ్రీనివాస్ భోగి రెడ్డి జడ్జిగా నటించారు. కుటుంబ సమేతంగా వడలివచ్చి అమ్మవారికి పూజలు, కుంకుమార్చనలు నిర్వహించారు. వడలి గ్రామస్తులు చూపుతున్న ఆదరాభిమానాలు మరువలేనివి అన్నారు. కోర్ట్ చిత్రాన్ని ప్రజలు ఎంతగానో ఆదరిస్తున్నారు.
News March 27, 2025
మొగల్తూరుపై పవన్ ఫోకస్.. కారణం ఇదే!

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తల్లి అంజనా దేవి స్వగ్రామం మొగల్తూరు. తండ్రిది పెనుగొండ. దీంతో ఈ రెండు గ్రామాలపై డిప్యూటీ సీఎం స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఆ రెండు చోట్ల సమస్యలు తెలుసుకోవడానికి శుక్రవారం ప్రత్యేక మీటింగ్ నిర్వహిస్తున్నారు. ఏకంగా పవన్ పేషీకి సంబంధించిన అధికారులు ఈ రెండు గ్రామాలకు వస్తారు. ప్రజలకు అవసరమైన సౌకర్యాలను గుర్తించి పవన్‌కు వివరించనున్నారు. ఆ తర్వాత అభివృద్ధి పనులు చేపడతారు.
News March 27, 2025
ప.గో జిల్లాలో టెన్షన్.. టెన్షన్

పశ్చిమగోదావరి జిల్లాలో మరికాసేపట్లో ఎంపీపీ, ఉపసర్పంచ్ పదవులకు ఉప ఎన్నిక జరగనుంది. అత్తిలి, యలమంచిలిలో వైసీపీకి పూర్తి మెజార్టీ ఉంది. ఓ ఐదారు మంది వైసీపీకి హ్యాండ్ ఇస్తే ఆ ఎంపీపీ పదవులు కూటమి ఖాతాలోకి వెళ్లిపోయే అవకాశం ఉంది. ఆ దిశగా కూటమి నాయకులు ప్లాన్ చేశారని సమాచారం. వైసీపీకి షాక్ ఇస్తారా? లేదా ఆ స్థానాలను వైసీపీనే నిలబెట్టుకుంటుందా? చూడాలి. మరోవైపు పోలీసులు 144 సెక్షన్ అమలు చేస్తున్నారు.