News March 2, 2025

ఉంగుటూరు: విద్యార్థులతో తాపీ పనులు

image

ఉంగుటూరు మండలం పెద్ద అవుటపల్లి జెడ్పీ హైస్కూల్‌లో విద్యార్థులతో ఎండలో పని చేయిస్తున్న ఘటన కలకలం రేపింది. హెచ్‌.ఎం, డ్రిల్ మాస్టర్ ఆదేశాలతో విద్యార్థులతో తాపీ పని చేయించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. వేసవిలో చెప్పులు లేకుండా విద్యార్థులతో పనిచేయించడం ఆందోళన కలిగిస్తోంది. స్కూల్‌లో ఇలా చేయించడమేంటనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Similar News

News March 4, 2025

తడి,పొడి చెత్త సేకరణపై ప్రత్యేక దృష్టి: కలెక్టర్ 

image

తడి,పొడి చెత్త సేకరణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ బాలాజీ అన్నారు. సోమవారం మచిలీపట్నం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఆయన అన్ని మున్సిపల్ కమిషనర్లు, ఎండీవోలు, పంచాయతీ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కొంతమంది తడి,పొడి చెత్తను కలిపి ఇస్తున్నారని, దీనిపై పారిశుద్ధ్య సిబ్బందికి అవగాహన లేనట్లనిపిస్తుందని, ప్రజలకు సిబ్బందికి అవగాహన కల్పించాలన్నారు. 

News March 3, 2025

పెనమలూరు: సీఎం పర్యటన భద్రతపై సమీక్షించిన ఎస్పీ 

image

పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ కుమారుడి వివాహ రిసెప్షన్ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం విచ్చేయనున్నారు. ఈ నేపథ్యంలో, భద్రత ఏర్పాట్లను సోమవారం ఎస్పీ ఆర్ గంగాధర్ రావు పరిశీలించారు. 5వ తేదీ సాయంత్రం సిద్ధార్థ కాలేజ్ ఆవరణలో రిసెప్షన్ వేడుకలు జరగనున్నాయి. రిసెప్షన్ వేడుకలకు మంత్రులు, ఎమ్మెల్యేలు వివిధ ముఖ్య నేతలు పాల్గొన్నారు.  

News March 3, 2025

బాపులపాడు: రోడ్డు ప్రమాదం.. బాలుడు మృతి

image

బాపులపాడు మండలంలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసుల తెలిపిన వివరాల మేరకు.. ఏలూరు జిల్లా గుండుగొలనుకి చెందిన నాగరాజు కుటుంబం బైక్‌పై గుడివాడ వెళ్తుండగా ఆరుగొలను వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొంది. దీంతో తీవ్ర గాయాలతో ఉన్న క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి తీసుకెళ్లే క్రమంలో బాలుడు మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

error: Content is protected !!