News February 18, 2025
ఉంగుటూరు: వివాహేతర సంబంధమే హత్యకు కారణం?

ఉంగుటూరు(M) బావాయిపాలెంలో <<15486017>>ఏసురాజు హత్యకు <<>>వివాహేతర సంబంధమే కారణంగా తెలుస్తోంది. ప్రియురాలు భర్త, మామలే ఏసు రాజుని హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. తన భార్యతో చనువుగా ఉండొద్దని ఆమె భర్త చెప్పినా వినకపోవడం, మెసేజ్లు చేస్తున్నాడనే కోపంతో ఏసురాజుని బావాయిపాలెం తీసుకొచ్చి చేయి నరికేశారు. అనంతరం రక్తస్రావంతో ఏసు మృతి చెందాడు. కాగా మృతుడు రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు.
Similar News
News November 22, 2025
కార్ల వేలానికి ఓకే.. నీరవ్ మోదీకి సీబీఐ కోర్టు షాక్

బ్యాంకులను మోసం చేసి పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి సీబీఐ కోర్టు షాకిచ్చింది. ఆయనకు సంబంధించి ఈడీ సీజ్ చేసిన 2 కార్లను వేలం వేయడానికి స్పెషల్ జడ్జి జస్టిస్ ఏవీ గుజ్రాతీ అనుమతించారు. బెంజ్ GLE250 (39 లక్షలు), స్కోడా సూపర్బ్ ఎలిగెన్స్ (7.5 లక్షలు) కార్లు వేలం వేసి డబ్బును నేషనలైజ్డ్ బ్యాంక్లో డిపాజిట్ చేయాలన్నారు. సీజ్ చేసిన 3 కార్ల వేలానికి అనుమతి కోరగా రెండింటికే అంగీకరించింది.
News November 22, 2025
‘మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే సీఎం లక్ష్యం’

దేశ ప్రగతి మహిళల అభివృద్ధిపైనే ఆధారపడి ఉందని ఎంపీ కడియం కావ్య అన్నారు. హనుమకొండలో జరిగిన ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో కోటి మంది మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే సీఎం రేవంత్ రెడ్డి ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు, పెట్రోల్ బంకులు, సోలార్ యూనిట్లు ఏర్పాటుతో పాటు పారిశ్రామిక అవకాశాలు కూడా కల్పిస్తున్నట్లు తెలిపారు.
News November 22, 2025
సత్యసాయి బాబా శతజయంతి వేడుకలు ఘనంగా నిర్వహించండి: కలెక్టర్

పుట్టపర్తి సత్యసాయి బాబా శత జయంతి వేడుకలను జిల్లాలో ఘనంగా నిర్వహించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డా. ఏ.సిరి ఆదేశించారు. ఈనెల 23 రాష్ట్రస్థాయి కార్యక్రమంగా జరుపుతున్న నేపథ్యంలో ప్రతీ మండలంలో జయంతి ఉత్సవాలు జరగాలని సూచించారు. సత్యసాయి బాబా బోధనలు, సేవా తత్వం యువతకు ప్రేరణ కాబోతున్నందున యువత పెద్దఎత్తున పాల్గొనేలా చూడాలని కలెక్టర్ ఆదేశించారు.


