News January 29, 2025
ఉండవల్లి: సీఎం చంద్రబాబును కలిసిన నూతన డీజీపీ

ప్రస్తుతం విజిలెన్స్ డీజీగా ఉన్న హరీష్ కుమార్ గుప్తా ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును మర్యాద పూర్వకంగా కలిసి హరీష్ కుమార్ గుప్తా పుష్పగుచ్ఛం అందజేశారు. ప్రస్తుతం డీజీపీగా ద్వారకా తిరుమల రావు ఎల్లుండి పదవీవిరమణ చేయనున్న నేపథ్యంలో 1992 ఐపీఎస్ బ్యాచ్‌కి చెందిన గుప్తాను ప్రభుత్వం రాష్ట్ర నూతన డీజీపీగా నియమించింది.
Similar News
News February 7, 2025
గుంటూరు: సప్లిమెంటరీ పరీక్షల టైం టేబుల్ విడుదల

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(ANU) పరిధిలోని కళాశాలల్లో బీ ఫార్మసీ చదివే విద్యార్థులు రాయాల్సిన 6వ సెమిస్టర్(సప్లిమెంటరీ) థియరీ పరీక్షలను ఈనెల 18, 20, 22, 24, 27, మార్చి 1వ తేదీలలో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 వరకు నిర్వహిస్తామని ANU పరీక్షల విభాగ సిబ్బంది తెలిపారు. టైం టేబుల్ పూర్తి వివరాలకు https://www.nagarjunauniversity.ac.in/ వెబ్‌సైట్ చూడాలని కోరారు.
News February 7, 2025
ప్రియురాలికి ఎలుకల మందు ఇచ్చిన ఉద్యోగిపై కేసు: సీఐ

ప్రియురాలికి ఓ సచివాలయ ఉద్యోగి ఎలుకల ముందు ఇచ్చి ఆత్మహత్యకు ప్రేరేపించిన ఘటన ప్రత్తిపాడులో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రత్తిపాడు సీఐ శ్రీనివాసరావు తెలిపిన వివరాల మేరకు.. సచివాలయ ఉద్యోగి ప్రేమ పేరుతో ఓ యువతిని వేధించి ఉద్యోగం వచ్చాక పెళ్లికి నిరాకరించాడు. ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందని ఇంట్లోకి పెళ్లికి ఒప్పుకోవడం లేదని నమ్మబలికి ప్రియురాలికి ఎలుకల ముందు ఇచ్చి ఆత్మహత్యకు ప్రేరేపించాడు.
News February 7, 2025
గుంటూరు: కూతురి పట్ల అసభ్య ప్రవర్తన.. తండ్రిపై దాడి

కూతురిని అసభ్యకరంగా దూషించి ఆమె తండ్రిపై దాడి చేసిన ముగ్గురు యువకులపై పట్టాభిపురం పీఎస్‌లో కేసు నమోదైంది. విద్యానగర్ 1వ లైన్ శివారు మార్గం ద్వారా ఒక వ్యక్తి తమ కుమార్తె వాహనంపై వస్తున్నారు. ఈ క్రమంలో మద్యం సేవించిన యువకులు అతని కుమార్తెను దూషించారు. అనంతరం ఆమె తండ్రి ఆ యువకులను మందలించడంతో మద్యం సీసాతో దాడి చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.