News February 24, 2025

ఉండవెల్లి: ఉరేసుకుని యువకుడి సూసైడ్

image

ఉరేసుకుని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల వివరాలు.. ఉండవెల్లి మండలం తక్కశీల గ్రామానికి చెందిన అనిల్ కుమార్ మద్యానికి బానిసై చదువు ఆపేశాడు. రోజు పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం మద్యం కోసం తల్లి జయమ్మను డబ్బులు అడగగా ఆమె మందలించింది. కోపోద్రిక్తుడైన అనిల్‌కుమార్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకున్నాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.

Similar News

News February 24, 2025

CRICKET: ఈ రోజు చాలా స్పెషల్ గురూ..

image

క్రికెట్ చరిత్రలో వేర్వేరు సంవత్సరాల్లో ఈ రోజు(FEB 24)న పలు రికార్డులు నమోదయ్యాయి. 2010లో సౌతాఫ్రికాపై వన్డేల్లో సచిన్ టెండూల్కర్ డబుల్ సెంచరీ చేశారు. అంతర్జాతీయ వన్డేల్లో ఇదే తొలి డబుల్ సెంచరీ. 2013లో మిస్టర్ కూల్ ధోనీ టెస్టుల్లో డబుల్ సెంచరీ చేసిన తొలి భారత వికెట్ కీపర్‌గా నిలిచారు. ఇక 2015లో విండీస్ క్రికెటర్ గేల్ వన్డే వరల్డ్ కప్‌లో ద్విశతకం బాదిన తొలి ప్లేయర్‌గా చరిత్రకెక్కారు.

News February 24, 2025

పల్నాడు జిల్లా ఆసుపత్రిలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

image

పల్నాడు జిల్లా ఆసుపత్రిని సోమవారం జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు అకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రి సూపరిండెంట్ డా.రంగారావును వైద్య సేవల వివరాలడిగి తెలుసుకున్నారు. వైద్యశాలలో రోగులను పలకరించి మాట్లాడారు. జిల్లాలో జరుగుతున్న సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియకు సంబంధించి, విజువల్ సర్టిఫికెట్లు వివరాలను తెలుసుకున్నారు. ఎప్పటికప్పుడు సర్టిఫికెట్ల సమాచారం ఆన్‌లైన్లో అప్లోడ్ చేయాలన్నారు.

News February 24, 2025

పెద్దపల్లి: రేపు ప్రభుత్వ హాస్పటల్‌లో డాక్టర్ల భర్తీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూ

image

ఫిబ్రవరి 25న గైనకాలజిస్ట్ పోస్టుల భర్తీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నట్లు పెద్దపల్లి జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్ పేర్కొన్నారు. జిల్లాలోని తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న 2 సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ (గైనకాలజిస్ట్) కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేస్తున్నామన్నారు. మరిన్ని వివరాలకు 8499061999ను సంప్రదించాలని సూచించారు.

error: Content is protected !!