News February 24, 2025
ఉండవెల్లి: ఉరేసుకుని యువకుడి సూసైడ్

ఉరేసుకుని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల వివరాలు.. ఉండవెల్లి మండలం తక్కశీల గ్రామానికి చెందిన అనిల్ కుమార్ మద్యానికి బానిసై చదువు ఆపేశాడు. రోజు పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం మద్యం కోసం తల్లి జయమ్మను డబ్బులు అడగగా ఆమె మందలించింది. కోపోద్రిక్తుడైన అనిల్‌కుమార్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకున్నాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.
Similar News
News February 24, 2025
11 నిమిషాలు కూడా సభలో ఉండలేకపోయారా?: షర్మిల

AP: సభ్యత్వాలు రద్దవుతాయనే భయంతోనే జగన్ అసెంబ్లీకి వచ్చారని ఏపీసీసీ చీఫ్ షర్మిల ఆరోపించారు. 11 మంది ఎమ్మెల్యేలతో కలిసి సభలో 11 నిమిషాలు కూడా కూర్చోలేకపోయారా అని ఆమె విమర్శించారు. ‘జగన్‌కు ప్రజల శ్రేయస్సు కంటే పదవులే ముఖ్యం. ప్రశ్నించడానికి మీకు ప్రతిపక్ష హోదానే కావాలా? చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీ సమావేశాలకు వెళ్లాలి. జనాలు ఛీ కొడుతున్నా జగన్ తీరు మాత్రం మారటం లేదు’ అని ఆమె ట్వీట్ చేశారు.
News February 24, 2025
ఉప ఎన్నికలు ఎలా వస్తాయి?: సీఎం రేవంత్

TG: రాష్ట్రంలో గత పదేళ్లలో రాని ఉప ఎన్నికలు ఇప్పుడెందుకు వస్తాయని సీఎం రేవంత్ ప్రశ్నించారు. ‘గతంలో TDP, కాంగ్రెస్ పార్టీల ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను BRSలో చేర్చుకోలేదా? వారిని మంత్రులను చేయలేదా? అప్పుడు రాని ఎన్నికలు ఇప్పుడెలా వస్తాయి. అప్పటి కోర్టులే కదా ఇప్పుడు ఉన్నాయి’ అని వ్యాఖ్యానించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల స్థానాల్లో ఉపఎన్నికలు వస్తాయని ప్రతిపక్షాలు తరచుగా పేర్కొంటున్న సంగతి తెలిసిందే.
News February 24, 2025
ఏసీబీకి చిక్కిన అన్నమయ్య జిల్లా అధికారి

లంచం తీసుకుంటూ ఏసీబీ వలలో జౌళి శాఖ అధికారి కృష్ణయ్య పడ్డాడు. అన్నమయ్య జిల్లా, రాయచోటిలో చేనేత జౌళి శాఖ జిల్లా అధికారి కృష్ణయ్య సోమవారం లబ్ధిదారుల నుంచి రూ.70 వేలు లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ అడిషనల్ ఎస్పీ విజయ కుమారి ఆదేశాలతో కడప ఏసీబీ డీఎస్పీ జెస్సి ప్రశాంతి, సీఐలు జిల్లా జౌళి శాఖ అధికారి కృష్ణయ్యను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. మరిన్ని వివరాలను వెల్లడిస్తామని అడిషనల్ ఎస్పీ విజయకుమారి తెలిపారు.