News April 6, 2024

ఉండిలో టీడీపీ.. చింతలపూడిలో వైసీపీ

image

ఉమ్మడి ప.గో.లో గెలుపే లక్ష్యంగా YCP, TDP కూటమి MLA అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. టికెట్ల కేటాయింపు అయ్యాక చింతలపూడిలో సిట్టింగ్ MLA ఎలీజాను కాదని YCPవిజయరాజుకు టికెట్ ఇచ్చింది. దీంతో ఆయన కాంగ్రెస్‌లో చేరి టికెట్ దక్కించుకున్నారు. తాజాగా ఉండిలో TDP సైతం MLAమంతెన రామరాజును కాదని ఎంపీ RRRకు టికెట్ ఇచ్చింది. ఇప్పటికే రామరాజు అనుచరులు ఆందోళనలకు సిద్ధం కాగా ఆయనకు ఎలాంటి అవకాశం ఇస్తుందో చూడాలి.

Similar News

News January 17, 2025

భీమవరం మావుళ్లమ్మను దర్శించున్న శ్యామలా దేవి

image

భీమవరం శ్రీమావుళ్లమ్మ అమ్మవారిని ప్రతి సంవత్సరం దర్శించుకుంటానని కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి అన్నారు. శుక్రవారం అమ్మవారిని దర్శించుకుని చీర అందించారు. ఆలయ ఈవో బుద్ధ మహాలక్ష్మి నగేశ్ స్వాగతం పలికి ఆలయ అర్చకులచే ప్రత్యేక పూజలను నిర్వహించి, సత్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. మొగల్తూరులో కృష్ణంరాజు, సూర్యనారాయణరాజు పేరిట షుగర్ వ్యాధి ఆసుపత్రిని ప్రారంభిస్తామని తెలిపారు.

News January 17, 2025

ప.గో: బరువెక్కిన గుండెతో పయనం

image

ప.గో జిల్లా వ్యాప్తంగా ప్రయాణికులు సంక్రాంతి పండుగ ముగించుకుని పట్టణాలకు పయనమయ్యారు. ఈ సందర్భంగా పండుగ జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ.. అప్పుడే పండుగ ముగిసిందా అన్నట్లుగా ఉద్యోగ, వ్యాపారాల రీత్యా పట్టణాలకు వెళ్తున్నారు. ఈసంక్రాంతి సంబరాలను రాబోయే పండగ వరకు నెమరువేసుకుంటూ సంతోషిస్తామని పలువురు ప్రయాణికులు తెలిపారు. పిండి వంటలతో పట్టణాలకు పయనమయ్యేవారితో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిక్కిరిశాయి.

News January 17, 2025

ఏలూరు: హీటర్ ఆన్ చేసి మరిచిపోయి వ్యక్తి సజీవదహనం

image

హీటర్ పెట్టి బకెట్ కరిగి కరెంట్ షాక్‌తో వ్యక్తి సజీవదహనమైన ఘటన ఏలూరులో గురువారం జరిగింది. కాకినాడకు చెందిన గంగాధర్ (30) తాత డెత్ సర్టిఫికెట్ కోసం ఏలూరులోని అక్క ఇంటికి వచ్చాడు. మద్యం తాగి నిద్రిస్తుండగా.. అక్క గడియ పెట్టుకుని బయటకు వెళ్లింది. గంగాధర్ లేచి నీళ్లు పెట్టుకుని మళ్లీ నిద్రపోయాడు. ఎక్కువ సేపు ఉండిపోవడంతో ప్రమాదం జరిగింది. ఘటనా స్థలాన్ని 1 టౌన్ CI సత్యనారాయణ పరిశీలించినట్లు తెలిపారు.