News June 4, 2024

ఉండిలో 9 రౌండ్లు కంప్లీట్.. RRR ఆధిక్యం 29338

image

ఉండి నియోజకవర్గ కూటమి MLA అభ్యర్థి రఘురామకృష్ణరాజుకు 9 రౌండ్లు పూర్తయ్యేసరికి మొత్తం 62017 ఓట్లు రాగా.. 29338 ఓట్లతో ముందంజలో కొనసాగుతున్నారు. కాగా ఇక్కడ వైసీపీ నుంచి పోటీ చేస్తున్న పీవీఎల్ నరసింహరాజుకు 32679 ఓట్లు వచ్చాయి.

Similar News

News November 28, 2025

బాధితులకు రూ.1.85 కోట్లు అందజేత: కలెక్టర్

image

జిల్లాలో ఎస్సీ, ఎస్టీలపై జరిగిన దాడుల కేసుల విచారణ వేగవంతం చేయాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు. గురువారం జరిగిన విజిలెన్స్ కమిటీ సమావేశంలో డిసెంబర్ 24 నుంచి మే 25 వరకు బాధితులకు రూ.1.85 కోట్ల పరిహారం చెల్లించామని తెలిపారు. అట్రాసిటీ కేసులలో ఎఫ్ఐఆర్, చార్జిషీట్ నమోదులో జాప్యం జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.

News November 28, 2025

భీమవరంలో మాక్ అసెంబ్లీ

image

మాక్ అసెంబ్లీ నిర్వహణ ద్వారా విద్యార్థుల్లో సృజనాత్మకత పెరుగుతుందని హెచ్.ఎం. కె. కృష్ణకుమారి అన్నారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా భీమవరంలోని ఝాన్సీలక్ష్మీబాయి మున్సిపల్ హైస్కూల్‌లో విద్యార్థినులు గురువారం మాక్ అసెంబ్లీ నిర్వహించారు. రాజ్యాంగం తయారు చేయడానికి ముందు, తర్వాత ప్రజల జీవన విధానం ఎలా ఉండేదో తెలిపే స్కిట్‌ను కూడా పాఠశాల విద్యార్థినులు ప్రదర్శించారు.

News November 27, 2025

కంబోడియా సూత్రధారి.. ప.గోలో 13 మంది అరెస్టు

image

భీమవరానికి చెందిన రిటైర్డ్ ఉద్యోగి శర్మ నుంచి రూ.78 లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్ల గుట్టును పోలీసులు రట్టు చేశారు. కంబోడియాకు చెందిన ప్రధాన సూత్రధారి రహేత్ జె నయన్ సహకారంతో.. ‘కార్డ్ డీల్’ పద్ధతిలో ఈ మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. ఈ కేసులో మొత్తం 13 మందిని అరెస్టు చేయగా, ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.