News December 22, 2024
ఉండి: ఆ ఇద్దరూ దొరికితే వీడనున్న చిక్కుముడి

ఉండి మండలం యండగండిలో తులసి అనే మహిళ ఇంటికి డెడ్‌బాడీ పార్శిల్ ఘటన రాష్ట్రంలో సంచలనం రేపింది. ఆ మృతదేహం ఎవరిది? ఎందుకు పార్శిల్ చేశారనేది ఉత్కంఠగా మారింది. కాగా తులసి మరిది సిద్ధార్థ వర్మే నిందితుడిగా పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే తులిసి, ఆమె చెల్లికి ఉన్న ఆస్తి తగాదాలే ఇందుకు కారణమనే ప్రచారం సాగుతోంది. ఆటోలో మృతదేహాన్ని పార్శిల్‌కు అప్పగించిన మహిళ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.
Similar News
News November 23, 2025
‘రైతన్న.. మీకోసం’ పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్

ఈ నెల 24 నుంచి 29 వరకు జరిగే ‘రైతన్న.. మీకోసం’ వారోత్సవాలను సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. శనివారం భీమవరం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆమె సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రతి రైతుకూ అవగాహన కల్పించాలని, శాఖలన్నీ సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా అధికారులకు దిశానిర్దేశం చేశారు.
News November 23, 2025
ప.గో: బొలెరో ఢీకొని యువకుడి మృతి

నరసాపురం హైవేపై జరిగిన ప్రమాదంలో మొగల్తూరుకు చెందిన మన్నే ఫణీంద్ర (21) దుర్మరణం పాలయ్యారు. శనివారం పాలకొల్లు నుంచి ద్విచక్ర వాహనంపై వస్తుండగా వెనుక నుంచి వచ్చిన బొలెరో ఢీకొట్టిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన ఫణీంద్రను మెరుగైన వైద్యం కోసం భీమవరం తరలిస్తుండగా దారిలో మృతి చెందారు. మృతుడి సోదరుడు వాసు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ జయలక్ష్మి తెలిపారు.
News November 23, 2025
ప.గో: వందేళ్ల వేడుకకు వేళాయె..!

ప.గో జిల్లాలో ఈ నెల 23న శ్రీ సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. శనివారం భీమవరంలో సత్యసాయి సేవా సంస్థ ప్రతినిధులతో ఆమె సమావేశమై ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఉత్సవాల నిర్వహణకు సంబంధించిన విధివిధానాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.


