News December 24, 2024
ఉండి: ఎర్ర కారులో వచ్చిందెవరు..?

డెడ్‌బాడీ పార్శిల్ కేసులో చిక్కుముడులు వీడుతున్నాయి. ఇందులో <<14964154>>శ్రీధర్ వర్మనే <<>>కీలకమని పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. తులసి ఇంటికి వచ్చిన డెడ్‌బాడీ <<14958481>>పర్లయ్యది<<>> అని తేల్చారు. ఎర్ర కారులో వచ్చిన మహిళ ఆటో డ్రైవర్‌కు పార్శిల్ ఇచ్చి తులసికి ఇవ్వాలని చెప్పి వెళ్లిపోయింది. అసలు ఆమెకు శ్రీధర్‌కు లింక్ ఏంటి? హత్య తర్వాత ఇద్దరూ కలిసి కారులో పారిపోయారా? అనేది తెలియాలి.
Similar News
News October 14, 2025
భీమవరం: అధికారులకు కలెక్టర్ ఆదేశాలు

ఈనెల 22 నుంచి ప్రారంభం కానున్న కార్తీక మాసం ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ నాగరాణి పీజీఆర్ఎస్లో దేవాదాయ, మున్సిపల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కార్తీక మాసంలో దేవాలయాలు శోభాయమానంగా ఉండేలా సిద్ధం చేయాలని, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. పేరుపాలెం బీచ్ వద్ద సముద్ర స్నానాల కోసం తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు.
News October 13, 2025
భీమవరం: నేటి పీజీఆర్ఎస్కు 95 అర్జీలు

భీమవరం కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ చదలవాడ నాగరాణి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆమె ప్రజల నుంచి 95 అర్జీలను స్వీకరించారు. అర్జీదారులకు సంతృప్తి కలిగేలా సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. తమ పరిధిలో లేని అర్జీలను సంబంధిత శాఖలకు పంపించాలని సిబ్బందికి సూచించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News October 13, 2025
తణుకు: గల్లంతైన బాలుడి మృతదేహం లభ్యం

తణుకు మండలం పైడిపర్రు కాలువలో పడి గల్లంతైన బొమ్మనబోయిన జోగేంద్ర (13) మృతదేహాన్ని పోలీసులు సోమవారం గుర్తించారు. జోగేంద్ర తన స్నేహితులతో కలిసి ఆడుకుందామని వెళ్లి ప్రమాదవశాత్తు కాలువలో పడి ఆదివారం గల్లంతైన విషయం తెలిసిందే. అత్తిలి మండలం గుమ్మంపాడు సమీపంలో కాలువలో బాలుడు మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.