News November 21, 2024

ఉండి: గవర్నర్‌తో సమావేశమైన డిప్యూటీ స్పీకర్ RRR

image

ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు గవర్నర్ అబ్దుల్ నజీర్‌తో బుధవారం మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో పలు అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించడం జరిగిందని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. తన అభ్యర్థనకు సానుకూలంగా స్పందించిన గవర్నర్ చర్యలు చేపట్టే దిశగా అడుగులు వేస్తామని హామీ ఇచ్చారని RRR తెలిపారు.

Similar News

News October 27, 2025

తణుకు: జాతీయ రహదారిపై నిలిచిన ఆర్టీసీ బస్సు

image

ఆర్టీసీ బస్సుల నిర్వహణ తీరు అధ్వానంగా మారిందని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. తాజాగా, కాకినాడ డిపోనకు చెందిన బైపాస్‌ ఎక్స్‌ప్రెస్‌ బస్సు (విజయవాడ-కాకినాడ) ఆదివారం రాత్రి తణుకు సర్మిష్ట సెంటర్ జాతీయ రహదారిపై నిలిచిపోయింది. ఇంజన్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతోనే బస్సు ఆగిపోయిందని అధికారులు తెలిపారు. ప్రయాణికులను వేరే బస్సులో గమ్యస్థానాలకు తరలించారు.

News October 27, 2025

పేరుపాలెం బీచ్‌కు నో ఎంట్రీ

image

బంగాళాఖాతంలో ఏర్పడిన ‘మొంథా’ తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున మొగల్తూరు మండలం పేరుపాలెం బీచ్‌ను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ఎస్.ఐ. జి. వాసు తెలిపారు. సోమ, మంగళ, బుధవారాలు (మూడు రోజులు) బీచ్‌కు పర్యాటకులు, యాత్రికులు రావద్దని, తుఫాను కారణంగా హెచ్చరికలు జారీ చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.

News October 27, 2025

ప.గో: మొంథా’ తుఫాన్.. నేటి పీజీఆర్ఎస్ రద్దు

image

‘మొంథా’ తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో అక్టోబర్ 27వ తేదీ సోమవారం కలెక్టరేట్‌లో జరగాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని మండల, డివిజన్, జిల్లా స్థాయిలో రద్దు చేసినట్లు కలెక్టర్ నాగరాణి తెలిపారు. ‘మొంథా’ తుఫాన్ కారణంగా జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, ఫిర్యాదుదారులు ఈ విషయాన్ని గమనించాలని ఆమె కోరారు.