News April 7, 2024

ఉండి టికెట్ RRRకేనా..? మీ కామెంట్..?

image

టీడీపీ అధినేత చంద్రబాబు నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గ నేతలతో పాలకొల్లులో సమావేశం అయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఉండి MLA అభ్యర్థిగా సిట్టింగ్ MLA మంతెనను కాదని RRRకు కేటాయించినట్లు వార్తలు రావడంతో మంతెన అభిమానులు బాబు కాన్వాయ్ వద్ద నినాదాలు చేస్తూ ఆందోళన చేశారు. ఆ తర్వాత టికెట్‌పై పూర్తి క్లారిటీ ఇవ్వలేదని మంతెన, RRR వేర్వేరుగా మీడియాతో వెల్లడించారు. దీంతో సందిగ్ధత నెలకొంది.
– మీ కామెంట్..?

Similar News

News January 26, 2025

భీమవరం: గణతంత్ర వేడుకల ఏర్పాట్లు పరిశీలించిన జెసీ 

image

భీమవరం కలెక్టరేట్ గ్రౌండ్ లో గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ మొగిలి వెంకటేశ్వర్లు పరిశీలించారు. ప్రభుత్వ పథకాలు ప్రతిబింబించేలా శకటాలు, స్టాల్స్ ఏర్పాట్లు చేయడం చేస్తున్నట్లు, సాంస్కృతిక కార్యక్రమాలను ప్రేక్షకులు వీక్షించేలా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు.

News January 26, 2025

కాళ్ళలో సీనియర్ ఓటర్లను సన్మానించిన తహశీల్దార్

image

జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని శనివారం కాళ్ల హైస్కూల్లో నిర్వహించారు. తహశీల్దార్ జి. సుందర్ సింగ్ మాట్లాడుతూ ఓటరు నమోదు ఆవశ్యకతను, ఓటు హక్కు విలువలను వివరించారు.  సీనియర్ ఓటర్లైన వయోవృద్ధులను సత్కరించి, కొత్తగా ఓటు హక్కు పొందిన వారికి కొత్త ఓటు గుర్తింపు కార్డును పంపిణీ చేశారు. అనంతరం విద్యార్థులతో కలిసి ఓటు ఆవశ్యకతపై ర్యాలీ నిర్వహించారు. వీఆర్వోలు శివనాగరాజు, రాజశేఖర్ సిబ్బంది పాల్గొన్నారు.

News January 25, 2025

సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించి ఎమ్మెల్యే రాధాకృష్ణ 

image

సీఎం చంద్రబాబు ఫిబ్రవరి 1న తణుకులో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో శనివారం తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ దువ్వ గ్రామంలో పర్యటించారు. తణుకు మండలంలోని తేతలి తవ్వ గ్రామాల్లో సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వ స్థలాలను పరిశీలించనున్నారు. ఈ క్రమంలో శనివారం ఎమ్మెల్యే రాధాకృష్ణ ఆయా ప్రాంతాల్లో పర్యటించి సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలించారు.