News April 10, 2024
ఉండి టీడీపీ శ్రేణుల వరుస రాజీనామాలు

ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే మంతెన రామరాజు టిక్కెట్ మారుస్తున్నారు అంటూ వస్తున్న ప్రచారానికి రామరాజు అభిమానులు పార్టీ సభ్యత్వానికి, పదవులకు రాజీనామా చేశారు. ఈ రాజీనామా లేఖను పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపినట్లుగా కార్యాలయ సిబ్బంది తెలిపారు. ఈ రాజీనామాలు నాలుగు మండలాల నాయకులు, కార్యకర్తలు చేసినట్లు కార్యాలయ సిబ్బంది తెలిపారు.
Similar News
News March 20, 2025
ప.గో : పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు 377 మంది దూరం

టెన్త్ విద్యార్థులకు బుధవారం ద్వితీయ భాష హిందీ పరీక్ష జరిగింది. పరీక్షకు 21999 మంది విద్యార్థులకు గాను 21622 మంది విద్యార్థులు హాజరు కాగా 377 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. 98.29% శాతం హాజరయ్యారని డిఇఓ నారాయణ తెలిపారు. అలాగే ఓపెన్ స్కూల్ ఆంగ్ల పరీక్షకు 457 మంది విద్యార్థులకు గాను 370 విద్యార్థులు హాజరు కాగా 87 గైర్హాజరయ్యారన్నారు.
News March 20, 2025
ట్రాన్స్‌జెండర్ హత్య.. ప.గో జిల్లా వాసి అరెస్ట్

అనకాపల్లి జిల్లాలో దీపు అనే ట్రాన్స్‌జెండర్ హత్య కలకలం రేపింన విషయం తెలిసిందే. అయితే ఇరగవరం(M) పొదలాడకు చెందిన బన్నీనే ఆ హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు. నాలుగేళ్ల నుంచి ఆమెతో సహజీవనం చేస్తూ..గొడవలు రావడంతో హత్య చేసినట్లు సమాచారం. కశింకోట మండలం బయ్యవరంలో హంతకుడు ఆమె నడుము కింది భాగం, కాలు, చేయి మూట కట్టి పడేశాడు. దీంతో జిల్లా ఇన్‌ఛార్జ్ SP వకుల్ జిందాల్ 8 టీమ్‌లతో దర్యాప్తు చేసి కేసు చేధించారు.
News March 20, 2025
స్వయం ఉపాధి పథకాలకు దరఖాస్తుల ఆహ్వానం

వెనుకబడిన తరగతుల వర్గాల నుంచి స్వయం ఉపాధి పథకాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ నాగరాణి తెలిపారు. బీసీ-ఎ,బీ,డీ,ఈ, ఈడబ్ల్యూఎస్ వర్గాల వారికి స్వయం ఉపాధి పథకాలు, జనరిక్ ఫార్మసీలు, ఎంఎస్ఎంఈ యూనిట్లు ఏర్పాటుకు సబ్సిడీతో కూడిన రుణాలను మంజూరు చేయనున్నట్లు తెలిపారు. అర్హులైన లబ్ధిదారులు *https://apobmms.apcfss.in* ద్వారా ఆన్‌లైన్లో మార్చి 22వ తేదీ లోపుగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.