News November 6, 2024

ఉండి: ట్రైనింగ్‌లో కుప్పకూలి టీచర్ మృతి

image

టీచర్ ఆకస్మికంగా మృతిచెందిన ఘటన ప.గో జిల్లాలో జరిగింది. ఉండి మండలం ఉనుదుర్రు హైస్కూల్ ఇన్‌ఛార్జ్ HM తోట రత్నకుమార్ ఆగిరిపల్లి హీల్ స్కూల్‌లో నిర్వహిస్తున్న లీడర్షిప్ శిక్షణకు హాజరయ్యారు. ఈక్రమంలో అక్కడ బుధవారం ఉదయం గుండె నొప్పి రావడంతో చనిపోయారు. తీవ్రమైన ఒత్తిడి, వైద్య సదుపాయాలు లేని అటవీ ప్రాంతంలో శిక్షణ ఇవ్వడంతోనే రత్నకుమార్ చనిపోయారని ఇతర టీచర్లు ఆరోపించారు.

Similar News

News December 4, 2025

జిల్లా వ్యాప్తంగా రేపు ‘మెగా పేరెంట్స్ టీచర్స్ మేళా’: DEO

image

పశ్చిమగోదావరి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల శుక్రవారం ‘మెగా పేరెంట్స్ టీచర్స్ మేళా’కు అన్ని ఏర్పాట్లు చేపట్టినట్లు DEO నారాయణ తెలిపారు. ఈ మేరకు ఆయా పాఠశాలలను చక్కగా ముస్తాబు చేశారు. మామిడి ఆకులు, అరిటి మొక్కలతో స్కూళ్లను సుందరంగా ముస్తాబు చేశారు. ఇప్పటికే ఉపాధ్యాయులు స్కూల్ విద్యార్థుల, తల్లితండ్రులకు సమాచారం అందించారు.

News December 4, 2025

రూ.14,00 కోట్లతో తాగునీటి ప్రాజెక్టు: కలెక్టర్

image

జిల్లాలో స్వచ్ఛమైన త్రాగునీరు అందించేందుకు రూ.1,400 కోట్ల వ్యయంతో ప్రాజెక్ట్ నిర్మాణాన్ని చేపట్టినట్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి గురువారం తెలిపారు. 16 మండలాల పరిధిలోని 862 గ్రామాల్లోని 13.25 లక్షల కుటుంబాలకు తాగునీరు అందించేలా ఈ ప్రాజెక్టును రూపొందించారు. దీని కోసం 2,662 కిలోమీటర్ల మేర పైపులైన్ వేయనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు.

News December 4, 2025

పాలకోడేరు: పిల్లలను ఎత్తుకుని ముద్దాడిన కలెక్టర్

image

పాలకోడేరు మండలంలోని విస్సాకోడేరులో ఉన్న శిశు గృహ సంరక్షణ కేంద్రాన్ని కలెక్టర్ చదలవాడ నాగరాణి గురువారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె శిశు గృహ సంరక్షణలో ఉన్న పిల్లలను ఎత్తుకుని ముద్దాడారు. కేంద్రంలో ఎంతమంది పిల్లలు ఉన్నారు, దత్తత ప్రక్రియ ఎంతవరకు వచ్చింది తదితర వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. పిల్లలను శ్రద్ధగా చూడాలని ఈ సందర్భంగా ఆమె అధికారులకు సూచించారు.