News December 22, 2024

ఉండి: తులసి మరిదే ప్రధాన సూత్రధారా?

image

ఉండి మండలం యండగండిలో పార్శిల్లో డెడ్‌బాడీ మిస్టరీ వీడినట్లు తెలుస్తోంది. తులసి మరిది సిద్ధార్ధ వర్మే ప్రధాన సూత్రధారి అని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే అతడు డెడ్‌బాడీ వచ్చినప్పటి నుంచి కనిపించకపోవడంతో పోలీసులు గాలిస్తున్నారు. డెడ్‌బాడీ ఎవరిది, ఆ పార్శిల్ తెప్పించింది ఎవరు అనే విషయాలు తెలియాలంటే సిద్ధార్ధ వర్మ దొరకాలి. పూర్తి వివరాలు తెలిపేందుకు మరో 2రోజులు పడుతుందని SP నయీం పేర్కొన్నారు.

Similar News

News January 22, 2025

మొగల్తూరు: ఎండు చేపలకు భలే గిరాకీ

image

మొగల్తూరు తీర ప్రాంత గ్రామాల్లో మత్స్యకారులు వేటను ముమ్మరంగా చేస్తున్నారు. పచ్చి సరకు కంటే ఎండు చేపలకు గిరాకీ ఉంటోంది. దీంతో వాటిని ఎండబెడుతూ మరింత ఆదాయం పొందుతున్నారు. బయట మార్కెట్లో ఎండు చేపలు సప్లై తక్కువగా ఉండడంతో మొగల్తూరులో ఎండు చేపలకు గిరాకీ పెరిగింది. కేజీ సుమారు రూ.500 పైనే పలుకుతోంది. మరోవైపు చేపలు, రొయ్యల మేతల్లో వీటిని కలిపేందుకు ఎగుమతులు సైతం భారీగా చేస్తున్నారు.

News January 22, 2025

ప.గో జిల్లాలో గంజాయిని అరికట్టాలి: ఎస్పీ

image

పాలకోడేరు మండలం గొల్లలకోడేరులోని పోలీసులు కార్యాలయంలో ఎస్పీ అద్నాన్ నయీం అస్మి నేర సమీక్షను మంగళవారం నిర్వహించారు. ముఖ్యమైన ప్రాపర్టీ కేసుల గురించి ఆరా తీశారు. నిందితులు అరెస్ట్ అయిన కేసుల్లో త్వరితగతిన ఛార్జ్‌షీట్ దాఖలు చేసి.. బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గంజాయి పూర్తిగా అరికట్టేలా కృషి చేయాలన్నారు.

News January 22, 2025

ప.గో జిల్లాలో కోళ్లకు మిక్స్‌డ్ వైరస్

image

ప.గో జిల్లాలో కోళ్లు <<15211030>>చనిపోతున్న <<>>విషయం తెలిసిందే. శీతాకాలంలో కోళ్లకు ఇలాంటి మిక్స్‌డ్ వైరస్ రావడం సహజమేనని పశువర్ధక శాఖ డీడీ జవహర్ హుస్సేన్ స్పష్టం చేశారు. ‘గాలి, నీరు, కోళ్ల ద్వారా వైరస్ వ్యాపిస్తుంది. వైరస్ సోకిన కోడిని కాల్చేయాలి. ముందు జాగ్రత్తగా RDF1, RDK, పాల్‌పాక్స్ టీకాలు వేయించాలి. యాంటి వైరల్ ఇన్పెక్టెంట్ లేదా బయోబస్టార్ పౌడర్‌ను లీటర్ నీటికి ఓ గ్రాము కలిపి తాగించాలి’ అని ఆయన సూచించారు.