News May 11, 2024
ఉండి నియోజకవర్గంలో పలువురు TDP నేతల సస్పెండ్

ఉండి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నిబంధనలకు వ్యతిరేకంగా పని చేస్తున్నారని పేర్కొంటూ పలువురిని పార్టీ ప.గో జిల్లా అధ్యక్షుడు మంతెన రామరాజు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మాజీ ఏఎంసీ ఛైర్మన్ సాగి సాంబశివరాజు, బురిడి రవి, మోపిదేవి శ్రీనివాస్, వత్సవాయి సూర్యనారాయణ రాజు, శ్రీనివాస్, సుజాత, అనంతలక్ష్మితో పాటు కాళ్ల మండలానికి చెందిన వెంకట్రావు తదితరులను సస్పెండ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News February 18, 2025
ఉంగుటూరు: వివాహేతర సంబంధమే హత్యకు కారణం?

ఉంగుటూరు(M) బావాయిపాలెంలో <<15486017>>ఏసురాజు హత్యకు <<>>వివాహేతర సంబంధమే కారణంగా తెలుస్తోంది. ప్రియురాలు భర్త, మామలే ఏసు రాజుని హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. తన భార్యతో చనువుగా ఉండొద్దని ఆమె భర్త చెప్పినా వినకపోవడం, మెసేజ్‌లు చేస్తున్నాడనే కోపంతో ఏసురాజుని బావాయిపాలెం తీసుకొచ్చి చేయి నరికేశారు. అనంతరం రక్తస్రావంతో ఏసు మృతి చెందాడు. కాగా మృతుడు రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు.
News February 18, 2025
తాడేపల్లిగూడెం: 21 వేల కోళ్ల ఖననం

బర్డ్ ఫ్లూ నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఎక్కడికక్కడ కోళ్ల ఫారాలను తనిఖీ చేస్తూ, అమ్మకాలపై ఆంక్షలు విధిస్తున్నారు. తాడేపల్లిగూడెం మండలం పెదతాడేపల్లిలోని ఓ ఫౌల్ట్రీలో అనుమానిత లక్షణాలు ఉన్న 21 వేల కోళ్లను అధికారులు ఖననం చేస్తున్నారు. పౌల్ట్రీ సమీపంలో గొయ్యి తవ్వించి వాటిని పాతిపెట్టారు. గ్రామంలో సోడియం హైపోక్లోరైడ్ పిచికారీ చేయించినట్లు కార్యదర్శి టి.రవిచంద్ తెలిపారు.
News February 18, 2025
భీమవరం: వివాహిత సూసైడ్

వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన భీమవరం మండలం గూట్లపాడు గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. శ్రీరామ్మూర్తి, నాగలక్ష్మికి 2018లో వివాహం జరిగింది. వీరికి బాబు, పాప ఉన్నారు. ఏమైందో తెలియదు కానీ సోమవారం నాగలక్ష్మి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అదనపు కట్నం కోసం భర్త, అత్తమామల వేధింపులతోనే తన సోదరి ఆత్మహత్యకు పాల్పడిందని నాగలక్ష్మి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.