News December 24, 2024

ఉండి: పనికని తీసుకెళ్లి చంపేశాడు..!

image

ఉండి డెడ్‌బాడీ పార్శిల్‌ కేసులో సరికొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. తులసి ఇంటికి వచ్చిన డెడ్‌బాడీ <<14958481>>పర్లయ్యదిగా<<>> గుర్తించిన విషయం తెలిసిందే. తన ఇంట్లో తాపీ పనుల కోసం పర్లయ్యను తులసి చెల్లెలి భర్త శ్రీధర్ వర్మ తీసుకెళ్లి హత్య చేసినట్లు సమాచారం. ఆ తర్వాత ఓ మహిళ సాయంతో ఈ డెడ్‌బాడీని తులసికి పంపాడు. ఆస్తి కోసమే ఈ నేరాన్ని తన వదిన, అత్తమామలపై నెట్టే ప్రయత్నంలో ఇలా చేసి ఉంటాడని అందరూ అనుమానిస్తున్నారు.

Similar News

News November 26, 2025

ప.గో జిల్లా.. భారీ వర్షాలు.. హెచ్చరిక

image

ప.గో జిల్లాలోని తీర ప్రాంతాల్లో ఈనెల 27 నుంచి డిసెంబర్ 1 వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని, ముఖ్యంగా 29, 30, డిసెంబర్ 1 తేదీల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ సూచించినట్లు జేసీ టి. రాహుల్ కుమార్ రెడ్డి తెలిపారు. రైతులు అప్రమత్తంగా ఉండి, పొలాల్లో తేమ పెరగకముందే వరి కోతకు సిద్ధం కావాలని ఆయన సూచించారు.

News November 26, 2025

పెనుగొండ ఇక ‘వాసవీ పెనుగొండ’

image

పెనుగొండ ఇకపై వాసవీ పెనుగొండగా మారనుంది. జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల సరిహద్దుల మార్పులు, చేర్పులపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘంతో సచివాలయంలో సీఎం చంద్రబాబు మంగళవారం సమీక్షించారు. ఈ మేరకు వచ్చిన వినతులను పరిగణనలోకి తీసుకుని పెనుగొండను వాసవి పెనుగొండగా మార్పు చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం ఇక్కడ ప్రసిద్ధిగాంచిన విషయం తెలిసిందే.