News December 24, 2024
ఉండి: పర్లయ్యను చంపితే అనుమానం రాదని..!
తులసిని హత్య కేసులో ఇరికించడానికే శ్రీధర్ వర్మ వ్యూహాత్మకంగా వ్యహరించినట్లు తెలుస్తోంది. కాళ్ల(M) గాంధీనగర్‌కు చెందిన <<14958481>>పర్లయ్య<<>> మద్యానికి బానిసై కుటుంబానికి దూరంగా ఉంటున్నారు. ఎక్కడ ఎవరు తిండి పెడితే అక్కడే పర్లయ్య పనిచేసి అక్కడే నిద్రిస్తుంటాడు. శ్రీధర్ మొదటి భార్యది కూడా పర్లయ్య ఊరే కావడంతో శ్రీధర్‌కు ఈ విషయం తెలిసింది. దీంతో పర్లయ్యను చంపితే ఎవరికీ అనుమానం రాదని తన ప్లాన్ అమలు చేశాడు.
Similar News
News January 21, 2025
Photo Of The Day: భార్యాభర్త ఫైరింగ్
ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం తడికలపూడిలో ఇవాళ పోలీస్ ఫైరింగ్ శిక్షణ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఏలూరు ఎస్పీ శివ ప్రతాప్ కిషోర్, జిల్లా జాయింట్ కలెక్టర్ ధాత్రి రెడ్డి పాల్గొన్నారు. భార్యాభర్తలైన ఎస్పీ, జేసీ ఒకేసారి ఇలా పక్కపక్కనే నిలబడి ఫైరింగ్ చేశారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
News January 21, 2025
ప.గో. కోళ్లకు అంతు చిక్కని వైరస్.. లక్షకు పైగా మృతి
కోళ్లకు అంతుచిక్కని వైరస్ సోకి మృత్యువాత పడటంతో కోళ్ల పెంపకందారులు ఆందోళన చెందుతున్నారు. కొన్ని రోజులుగా జిల్లాలో లక్షకు పైనే కోళ్లు మృతి చెందినట్లు చెబుతున్నారు. పందెం కోళ్లకు సైతం వైరస్ సోకి చనిపోవడంతో ఆర్థికంగా నష్టపోతున్నామని ఆవేదన చెందుతున్నారు. ఉదయం ఆరోగ్యంగా కనిపించిన కోళ్లు సాయంత్రానికి మృతి చెందుతున్నాయని చెబుతున్నారు. వైరస్ ప్రభావంతో అమ్మకాలు తగ్గి, ధరలు పతనమవుతున్నాయని అంటున్నారు.
News January 21, 2025
ఏలూరు: రోడ్డు ప్రమాదంలో ప్రైవేట్ ఉద్యోగి మృతి
చిట్యాల మండలం వెలిమినేడు శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏలూరు జిల్లా ముసునూరు మండలం చిల్లబోయినపల్లి గ్రామానికి చెందిన జువ్వనపూడి విక్రమ్ మృతి చెందాడు. హైదరాబాద్ లో విక్రమ్ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తుంటాడు. సంక్రాంతి పండుగకు చిల్లబోయినపల్లి ఇంటికి వచ్చాడు. తిరిగి సోమవారం బైక్‌పై హైదరాబాద్ వెళ్తుండగా వెలిమినేడు వద్ద బొలేరో వాహనం ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన విక్రమ్ అక్కడిక్కడే మృతి చెందాడు.