News December 23, 2024

ఉండి: ‘పార్సిల్ మృతదేహం గుర్తించిన వారు డీఎస్పీకి సమాచారం అందించాలి’

image

ఉండి మండలం యండగండి గ్రామంలో పార్సిల్ వచ్చిన మృతదేహం ఈ నెల 16, 17 తేదీల్లో చనిపోయి ఉండవచ్చని, ఈ మృతదేహాన్ని గుర్తించిన వారు తమకు చెప్పాలని భీమవరం డీఎస్పీ జయసూర్య తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. మృతదేహం ఒంటిపై నలుపు రంగు స్వెటర్ ఉందని అన్నారు. వయసు సుమారు 30 నుంచి 40 ఉండవచ్చని, ఎవరైనా మిస్ అయి ఉంటే డీఎస్పీ కార్యాలయంలోని 9154966497, 9440796648 నంబర్లకు సంప్రదించాలని కోరారు.

Similar News

News January 20, 2025

ప.గో జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ తొలగింపు

image

ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర గ్రంథాలయ సంస్థ ఛైర్మన్, సభ్యులను తొలగించింది. గత ప్రభుత్వ కాలంలో నియమితులై కొనసాగుతున్న ఏపీ గ్రంథాలయ పరిషత్ ఛైర్మన్, మెంబర్లను తక్షణమే తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పశ్చిమ గోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ చీరాల పద్మశ్రీని సైతం తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

News January 20, 2025

లక్కవరంలో మామిడి తోటలో పార్టీ..ఆరుగురు అరెస్ట్

image

జంగారెడ్డిగూడెం(M) లక్కవరం శివారులో మామిడి తోటలో అల్లరి సృష్టిస్తున్నారనే సమాచారంతో పోలీసులు దాడులు చేపట్టారు. శనివారం అర్ధరాత్రి సమయంలో పార్టీ చేసుకుంటూ అల్లర్లు చేస్తున్నారంటూ వచ్చిన సమాచారంతో జంగారెడ్డిగూడెం సీఐ కృష్ణబాబు తన సిబ్బందితో దాడులు చేపట్టారు. 23 తెలంగాణ మద్యం సీసాలు, 5 కార్లు, 3 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. ఆరుగురిని అరెస్ట్ చేయగా నలుగురు పరారీలో ఉన్నట్లు సీఐ తెలిపారు.

News January 20, 2025

నిడదవోలు విద్యార్థి విజయనగరంలో ఆత్మహత్య

image

ఉమ్మడి ప.గో జిల్లా నిడదవోలుకు చెందిన MBBS వైద్య విద్యార్థి ఆతుకూరి సాయి మణిదీప్ ఆదివారం నెల్లిమర్ల మిమ్స్ వైద్య కళాశాలలో తన హాస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకున్నాడు. చదువుపై ఏకాగ్రత లేకపోవడం, కుటుంబ సభ్యుల వేదనకు తానే కారణమవుతున్నానంటూ తల్లిదండ్రులకు సూసైడ్ నోట్ రాసి పురుగులు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.