News December 24, 2024

ఉండి: పోలీసుల అదుపులో శ్రీధర్ వర్మ..?

image

ఉండి మండలంలో సంచలనం రేపిన డెడ్‌బాడీ పార్శిల్ కేసులో కీలక పరిణామం జరిగింది. ఈ కేసులో కీలకంగా ఉన్న తులసి చెల్లెలి భర్త శ్రీధర్మ వర్మ పోలీసులకు చిక్కినట్లు తెలుస్తోంది. తులసి ఇంటికి డెడ్‌బాడీ వచ్చినప్పటి నుంచి ఇతను కనపడకపోవడంతో ఈ కేసులో అన్ని వేళ్లు అతని వైపే చూపిస్తున్నాయి. దీంతో పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలించగా అతను దొరికినట్లు తెలుస్తోంది. మరి అతను విచారణలో ఏం చెబుతాడనేది ఆసక్తిగా మారింది.

Similar News

News November 17, 2025

ప్రజలకు సంతృప్తి కలిగేలా సమస్యల పరిష్కారం: కలెక్టర్

image

భీమవరం కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కలెక్టర్ చదలవాడ నాగరాణి ప్రజల నుంచి 162 అర్జీలను స్వీకరించారు. అర్జీదారులకు సంతృప్తి కలిగేలా సమస్యలను పరిష్కరించాలని, తమ పరిధిలో లేని వాటిని సంబంధిత శాఖలకు పంపి త్వరితగతిన పరిష్కరించాలని ఆమె అధికారులను ఆదేశించారు.

పీఎంఏవై కింద ఇళ్ల మంజూరుకు త్వరపడండి: కలెక్టర్

image

గ్రామీణ ప్రాంతంలో సొంత స్థలం ఉన్న అర్హులైన లబ్ధిదారులు ప్రభుత్వ గృహం మంజూరుకు త్వరపడాలని కలెక్టర్ నాగరాణి సూచించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన (గ్రామీణ్) పథకం ద్వారా ఇళ్లు లేని పేదలకు గృహాలను మంజూరు చేస్తామని ఆమె తెలిపారు. ఈ నెల 30 లోగా అర్హులైన వారందరూ నమోదు చేసుకునేలా అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.