News May 11, 2024
ఉండేది విజయనగరం జిల్లా.. ఓటు విశాఖ ఎంపీకి

విశాఖ జిల్లాలో మొత్తం 1,991 పోలింగ్ కేంద్రాలున్నాయి. విశాఖ పార్లమెంట్ పరిధిలో పోలింగ్ కేంద్రాల సంఖ్య 1,962గా ఉంది. అయితే ఈ పార్లమెంటు పరిధిలోకి వచ్చే ఎస్.కోట అసెంబ్లీ నియోజకవర్గం విజయనగరం జిల్లాలో ఉంది. ఆ నియోజకవర్గ ఓటర్లు విశాఖ ఎంపీకి తమ ఓటు వేస్తారు. పెందుర్తి నియోజకవర్గంలోని కొంత భాగం విశాఖ జిల్లాలో ఉండగా.. ఆ నియోజకవర్గ ఓటర్లు అనకాపల్లి ఎంపీ స్థానానికి తమ ఓటును వినియోగించాల్సి ఉంటుంది.
Similar News
News December 4, 2025
విశాఖ: క్రికెటర్ కరుణ కుమారికి ఘన సత్కారం

అంధుల మహిళా టీ20 వరల్డ్ కప్ విజయంలో కీలక పాత్ర పోషించిన విశాఖ బాలికల అంధుల రెసిడెన్షియల్ విద్యార్థిని కరుణ కుమారిని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఘనంగా సత్కరించారు. ప్రపంచ కప్‌కు సెలెక్ట్ అయిన తరువాత ప్రాక్టీస్‌కు అనుగుణంగా కరుణకుమారికి ప్రత్యేకంగా రెండు క్రికెట్ కిట్లకు రూ.50వేలు ఇవ్వడం జరిగిందన్నారు. భారత జట్టు విజయంలో కీలక ప్రతిభ చూపిన ఆమెకు ప్రోత్సాహకంగా కలెక్టర్ రూ.లక్ష చెక్ అందజేశారు
News December 4, 2025
మహిళలకు అత్యంత సురక్షితమైన నగరంగా విశాఖ: హోం మంత్రి

మహిళలకు అత్యంత సురక్షితమైన నగరంగా విశాఖకు గుర్తింపు పొందిన సందర్భంగా బీచ్ రోడ్డులో ర్యాలీ నిర్వహించారు. హోం మంత్రి అనిత పాల్గొని ర్యాలీ ప్రారంభించారు. మహళల భద్రతే ఎన్డీయే ప్రభుత్వం లక్ష్యమని, సంఘటన జరిగిన వెంటనే శిక్షలు పడుతున్నాయన్నారు. శక్తి టీమ్స్, యాప్ ద్వారా మహిళలకు రక్షణ కల్పిస్తున్నామన్నారు. విశాఖకు జాతీయ స్థాయిలో ప్రఖ్యాతలు తీసుకువచ్చిన పోలీసులను మంత్రి అనిత అభినందించారు.
News December 4, 2025
6న విశాఖ రానున్న గవర్నర్ అబ్దుల్ నజీర్

ఈ నెల 6,7వ తేదీలలో గవర్నర్ అబ్దుల్ నజీర్ విశాఖ రానున్నారు. ఆరోజున ఉదయం 8 గంటలకు విశాఖ ఎయిర్ పోర్ట్‌కు చేరుకొని అక్కడ నుండి నోవాటెల్ కు చేరుకుంటారు. మధ్యామ్నం 12.45 గంటలకు మధురవాడలోని ACA-VDCA క్రికెట్ స్టేడియంకు వెళ్లి మ్యాచ్ వీక్షిస్తారు. రాత్రి 10గంటలకు స్టేడియం నుంచి నోవాటెల్ హోటల్‌కు చేరుకుని రాత్రి బస చేస్తారు. 7వ తేదీ మధ్యాహ్నం 1.45కు ఎయిర్ పోర్ట్‌కు చేరుకుని విజయవాడ తిరిగి వెళ్తారు


