News October 31, 2024

ఉండ్రాజవరం: పిడుగుపాటు మరణాలపై సీఎం విచారం

image

ఉండ్రాజవరం మండలం సూర్యరావుపాలెంలో బాణసంచా కేంద్రంపై పిడుగు పడి ఇద్దరు మృతి చెందిన ఘటనపై సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. మృతి చెందిన వెగిరోతు శ్రీవల్లి, గుమ్మడి సునీత కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. ప్రమాదంలో గాయపడిన ఐదుగురికి మెరుగైన వైద్యం అందించాలని, క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తనకు తెలియజేయాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు.

Similar News

News November 24, 2024

భీమవరం: ‘అభివృద్ధి పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి’

image

భీమవరం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో శనివారం కలెక్టర్ చదలవాడ నాగరాణి డ్వామా, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులతో సమీక్షించారు. జిల్లాలో 368 సీ.సీ, బీ.టీ, డబ్ల్యూబీఎంలు నిర్మాణాలు చేపట్టి పూర్తి చేయవలసి ఉండగా 318 గ్రౌండ్ కాగా, మొదలు పెట్టని 50 పనులను వెంటనే చేపట్టి డిసెంబర్ నెలాఖరుకి పూర్తి చేయాలని అన్నారు. రోడ్డు నిర్మాణ పనుల పురోగతి కనబర్చకపోతే వారిపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

News November 23, 2024

నరసాపురం లేస్‌కు భౌగోళిక సూచిక (జీఐ)కు ఎంపిక 

image

నరసాపురం లేస్‌కు భౌగోళిక సూచిక (జిఐ) ఎంపికతో అంతర్జాతీయ గుర్తింపు సాధించినట్లు ప.గో. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి శనివారం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దేశ రాజధాని ఢిల్లీలో కేంద్ర జౌళి శాఖ ఆధ్వర్యంలో నవంబర్ 25న హోటల్ ఒబెరాయ్‌లో జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా లేస్ పార్క్ సిబ్బందిని కలెక్టర్ అభినందించారు.

News November 23, 2024

భీమవరం: కేంద్ర మంత్రికి జిల్లా ప్రముఖులు పరామర్శలు

image

పితృవియోగం పొందిన కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మను పలువురు నేతలు శనివారం పరామర్శించారు. డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురాం కృష్ణంరాజు, మంత్రి నిమ్మల రామానాయుడు, ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు పులపర్తి రామాంజనేయులు, ఆరమిల్లి రాధాకృష్ణ, ధర్మరాజు, ఏపీఐఐసీ ఛైర్మన్ మంతెన రామరాజు, మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద్ రాజు, మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.