News October 31, 2024
ఉండ్రాజవరం: బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్గ్రేషియా
ఉండ్రాజవరం మండలం సూర్యారావు పాలెం గ్రామంలో బుధవారం జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు ఆర్థిక సాయం రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. బాణసంచా తయారీ కేంద్రంలో పిడుగు పాటుపై ఆయన తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఐదుగురు క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.
Similar News
News October 31, 2024
ఉండ్రాజవరం: పిడుగుపాటు మరణాలపై సీఎం విచారం
ఉండ్రాజవరం మండలం సూర్యరావుపాలెంలో బాణసంచా కేంద్రంపై పిడుగు పడి ఇద్దరు మృతి చెందిన ఘటనపై సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. మృతి చెందిన వెగిరోతు శ్రీవల్లి, గుమ్మడి సునీత కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. ప్రమాదంలో గాయపడిన ఐదుగురికి మెరుగైన వైద్యం అందించాలని, క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తనకు తెలియజేయాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు.
News October 31, 2024
పాలకోడేరులో సందడి చేస్తున్న అమెరికా పావురాలు
పాలకోడేరు మండలం మోగల్లులో అమెరికా పావురాలు సందడి చేస్తున్నాయి. గ్రామానికి చెందిన కంకిపాటి జోసఫ్ రెండు నెలల క్రితం తణుకు పట్టణం నుంచి రెండు పావురాలను కొనుగోలు చేసినట్లు చెప్పారు. వాటిని అమెరికా పావురాలు అంటారని, ఎవరు దగ్గరకు తీసుకొన్నా వారితో మమేకం అవుతాయని ఆయన చెప్పారు. పెసలు, కొర్రలు వాటికి ఆహారంగా పెడుతున్నామని జోసేఫ్ వివరించారు.
News October 31, 2024
ఇటువంటి ఘటన దురదృష్టకరం: కలెక్టర్
ఉండ్రాజవరం మండలం సూర్యరావుపాలెం గ్రామంలో బుధవారం పిడుగుపాటుకు బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదం పట్ల పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పండుగ సమయంలో ఇటువంటి ఘటన జరగడం దురదృష్టకరమన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.