News November 7, 2024

ఉండ్రాజవరం: వారం వ్యవధిలో 12 మంది మృత్యువాత

image

ఉండ్రాజవరం మండలంలో వారం వ్యవధిలో జరిగిన మూడు ప్రమాదాల్లో 12 మంది మృత్యువాత పడ్డారు. సూర్యరావుపాలెంలో గత నెల 30న జరిగిన భారీ విస్ఫోటనం ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా, ఈనెల 4న తాడిపర్రులో ఫ్లెక్సీ కడుతుండగా విద్యుత్ షాక్ తగిలి మరో నలుగురు మృత్యువాత పడ్డారు. మరోవైపు దీపావళి రోజున వెలగదుర్రులో టపాసులు కారుతుండగా మరో మహిళకు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స పొందుతూ మృతి చెందారు.

Similar News

News December 13, 2024

ఏలూరు జిల్లా వ్యాప్తంగా 96 అర్జీల పరిష్కారం: జేసీ

image

ఏలూరు జిల్లాలో గత రెండు రోజుల్లో నిర్వహించిన 64 గ్రామ రెవిన్యూ సదస్సుల్లో 854 అర్జీలు రాగా వాటిలో అక్కడికక్కడే 96 అర్జీలు పరిష్కరించామని జిల్లా జాయింట్ కలెక్టర్ దాత్రి రెడ్డి తెలిపారు. గురువారం జరిగిన సదస్సులకు 487 అర్జీలు రాగా 71అర్జీలు పరిష్కరించామన్నారు. వచ్చే ఏడాది జనవరి 8వ తేదీ వరకు రెవెన్యూ సదస్సులు జరుగుతాయని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News December 12, 2024

వైసీపీకి భీమవరం మాజీ MLA రాజీనామా?

image

ప.గో జిల్లాలో వైసీపీకి భారీ షాక్ తగిలినట్లు సమాచారం. భీమవరం మాజీ MLA గ్రంధి శ్రీనివాస్ ఆ పార్టీకి, సభ్యత్వానికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. వైసీపీ ఓటమి నుంచి పార్టీ కార్యక్రమాలకు ఆయన దూరంగా ఉన్నారు. అయితే ఆయన భవిష్యత్ కార్యాచరణ తెలియాల్సి ఉంది.

News December 12, 2024

ప.గో జిల్లాలో మాజీ సీఎం జగన్ పర్యటన

image

సంక్రాంతి తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తానని మాజీ సీఎం జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ముందుగా ఆయన పర్యటన ఉభయ గోదావరి జిల్లాలో ఉంటుందని తెలుస్తోంది. ఈ మేరకు స్థానిక నాయకులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. జగన్ గోదావరి జిల్లా పర్యటన చేస్తారని వైసీపీ చింతలపూడి ఇన్‌ఛార్జ్ కంభం విజయరాజు తెలిపారు. సంక్రాంతి తర్వాత జగన్ గోదావరి జిల్లా ప్రజలను కలుస్తారని చెప్పారు.