News March 23, 2025
ఉక్కు పరిశ్రమ ఊసే లేని కేంద్ర, రాష్ట్ర బడ్జెట్: సీపీఎం

ఉక్కు పరిశ్రమ ఊసే లేకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన బడ్జెట్లను ప్రజానీకం వ్యతిరేకించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కుంట ఉపేందర్ పిలుపునిచ్చారు. శనివారం వెంకన్న అధ్యక్షతన సీపీఎం మండల సాధారణ సమావేశం వేజేళ్ళ సైదులురావు భవనంలో జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News December 3, 2025
ఈ పేరున్న వారికి అదృష్టం వరించింది!

తిరుమల వైకుంఠ ద్వార దర్శనాల ఈ-డిప్లో మొత్తం 1.76 లక్షల మందికి అవకాశం లభించింది. టోకెన్లు పొందిన భక్తుల లిస్టు రిలీజ్ చేయగా ఓ ఇంట్రెస్టింగ్ విషయం వెలుగు చూసింది. ఇందులో వెంకట్& వెంకటేశ్ & శ్రీనివాస్ అనే పేర్లున్న వారే 12,099 మంది ఉన్నారు. అలాగే 10,474 మంది లక్ష్మీ, పద్మావతి &పద్మ అనే పేర్లున్నవారు ఉండటం విశేషం. తిరుమలేశుడి పేరున్నా తమకు అవకాశం రాలేదని మరికొందరు నిరాశ చెందుతున్నారు.
News December 3, 2025
యువతకు నైపుణ్యంపై పార్లమెంట్లో ఎంపీ హరీష్ గళం

కోనసీమ జిల్లా యువతకు నైపుణ్యాభివృద్ధి అవకాశాలు పెంచాలని అమలాపురం ఎంపీ గంటి హరీష్ బాలయోగి లోకసభలో 377 ద్వారా కోరారు. జిల్లా యువత ఆకాంక్షలకు అనుగుణంగా నైపుణ్యాభివృద్ధి సౌకర్యాలను విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లా స్థాయిలో తగిన శిక్షణా కేంద్రాలు లేకపోవడంతో విద్యార్థులు సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసి యువతకు మద్దతు ఇవ్వాలని కోరారు.
News December 3, 2025
చిట్యాల: ఇంటి పన్ను వసూళ్లు రికార్డు

గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో చిట్యాల మండలంలోని 18 గ్రామ పంచాయతీల్లో ఇంటి పన్ను వసూళ్లు భారీగా పెరిగాయి. మొత్తం రూ. 13,97,355 వసూలు అయినట్లు ఎంపీడీవో జయలక్ష్మి తెలిపారు. అత్యధికంగా వెలిమినేడులో రూ. 2,70,575 వసూలు కాగా, బొంగోనిచెరువు, గుండ్రాంపల్లిలలో కూడా భారీగా పన్నులు వసూలయ్యాయి. ఎన్నికల కారణంగానే ఈ స్థాయిలో వసూళ్లు పెరిగినట్లు అధికారులు పేర్కొన్నారు.


