News February 27, 2026

ఉగాదికి లక్ష టిడ్కో ఇళ్ల పంపిణీ!

image

AP: ఉగాది(MAR 19) నాటికి లక్ష టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందజేయనున్నట్లు పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్ తెలిపారు. మిగతా గృహాల నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేసుకొనేందుకు లబ్ధిదారులకు రుణాలు ఇవ్వాలని బ్యాంకర్లను కోరారు. దీంతో 40,500 మందికి ₹1,345Cr ఇచ్చేందుకు సమ్మతించారు. కాగా ఈ ఏడాది జూన్‌ నాటికి మొత్తంగా 2.61 లక్షల ఇళ్లను పేదలకు అందించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.

Similar News

News April 16, 2026

సత్యనారాయణ స్వామి కళ్యాణం.. శాఖల వారీగా బాధ్యతల అప్పగింత

image

అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామివారి కళ్యాణ మహోత్సవం ఈనెల 27న జరగనుంది. ఈ నేపథ్యంలో ఆలయ ఈవో నల్లం సూర్య చక్రధరరావు వివిధ శాఖల అధికారులతో గురువారం రాత్రి రత్నగిరిపై సమీక్ష నిర్వహించారు. కళ్యాణానికి వచ్చే భక్తుల సంఖ్య, వీవీఐపీలు, ప్రోటో కాల్, భక్తులకు ఏర్పాట్లు, దర్శనం, అన్నదానం, ప్రసాదం, తదితర అంశాలపై చర్చించి శాఖల వారీగా బాధ్యతలు అప్పగించారు. ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో పనిచేయాలని కోరారు.

News April 16, 2026

మోదీ నాయకత్వంలో దక్షిణాది బలపడుతుంది: బండి సంజయ్

image

డీలిమిటేషన్ వల్ల దక్షిణాదిలో ఎంపీ సీట్లు తగ్గుతాయన్న ప్రచారం <<19667857>>అమిత్ షా ప్రకటనతో<<>> తప్పని తేలిందని కేంద్రమంత్రి బండి సంజయ్ ట్వీట్ చేశారు. చాలా కాలంగా కొన్ని పార్టీలు నార్త్ vs సౌత్ రాజకీయాలు చేస్తూ ప్రజల్లో విషబీజాలు నాటేందుకు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. మోదీ నాయకత్వంలో దక్షిణాది బలహీనపడదని, మరింత బలంగా మారుతుందని స్పష్టం చేశారు.