News March 28, 2025
ఉగాది ఉత్సవాలను ఘనంగా నిర్వహించండి: కలెక్టర్

జిల్లాలో విశ్వావస నామ తెలుగు సంవత్సర ఉగాది ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్లో ఉగాది ఉత్సవ వేడుకలపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సమీక్షలో జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్, డీఆర్వో రాము నాయక్, తదితరులు ఉన్నారు.
Similar News
News November 24, 2025
భద్రాద్రి: బస్సులో జనం కిటకిట.. అడవిలో రాళ్లరోడ్డే శరణ్యం

ఉచిత బస్సు పథకం అందుబాటులోకి వచ్చిన దగ్గర నుంచి పరిమితికి మించి ప్రయాణికులు ఎక్కుతున్నారు. మణుగూరు – గుండాల నైట్ ఆల్ట్ బస్సు ప్యాసింజర్లతో కిక్కిరిసిపోయింది. వీరాపురం దాటాక అడవిలో రాళ్లరోడ్డే శరణ్యమని వాపోతున్నారు. ప్రయాణికులు గుండెలు అరచేతిలో పెట్టుకొని వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఎలాంటి ప్రమాదం జరగకముందే రోడ్డుని అభివృద్ధి చేసి, బస్సుల సంఖ్య పెంచాలని పలువురు కోరుతున్నారు.
News November 24, 2025
పాల్వంచ: అధికారుల కృషి ఫలితంగా జాతీయ స్థాయి అవార్డు

‘జల్ సంచయ్-జన్ భాగీదారీ’ జాతీయ స్థాయిలో మూడో జోన్కు చెందిన కేటగిరీ-3లో రాష్ట్రంలో మొదటి స్థానాన్ని సాధించింది. విశిష్ట ఫలితానికి గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం రూ.25 లక్షల నగదు బహుమతిని ప్రకటించిన సందర్భంగా జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో కలెక్టరేట్ సోమవారం అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో కలెక్టర్ జితేష్ వి పాటిల్ పాల్గొని మాట్లాడారు. అధికారుల కృషి ఫలితంగా అవార్డు వచ్చిందన్నారు.
News November 24, 2025
జగిత్యాల: జీవో 46 ప్రతులను దహనం చేసిన బీసీ నాయకులు

GO నంబర్ 46ను వ్యతిరేకిస్తూ బీసీ సంక్షేమ సంఘం నాయకులు సోమవారం జిల్లా కేంద్రంలోని తహసీల్ చౌరస్తాలో ఆ జీవో ప్రతులను దహనం చేశారు. ఈ సందర్భంగా బీసీ నాయకులు చింతల గంగాధర్ మాట్లాడుతూ, సర్పంచ్ ఎన్నికలలో బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల పరిమితి 50 శాతం మించకూడదనే సాకుతో రాష్ట్ర ప్రభుత్వం ఈ జీవో విడుదల చేయడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని పేర్కొన్నారు. గాజుల నాగరాజు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.


