News February 27, 2026
ఉగాది నాడు మూసీ ప్రాజెక్టుకు శంకుస్థాపన?

TG: మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుకు ఉగాది రోజున శంకుస్థాపన చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. తొలిదశలో హిమాయత్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు, ఉస్మాన్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు సుందరీకరణ పనులు చేపట్టనున్నారు. ఇందుకు రూ.5,000Cr అవసరమని అంచనా వేస్తున్నారు. రూ.4,100Cr ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ అందించనుండగా మిగతాది ప్రభుత్వం సమకూర్చుకుంటుంది. లంగర్‌హౌస్ బాపూఘాట్ వద్ద గాంధీ సరోవర్ నిర్మిస్తారు.
Similar News
News April 11, 2026
‘భూ సమస్యలకు పరిష్కారం చూపాలి’

భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న సాదా బైనమా,భూభారతి దరఖాస్తులు, ఎస్‌ఐఆర్ మ్యాపింగ్, ఇతర భూ సమస్యలపై కలెక్టర్ అంకిత్ శనివారం తాహశీల్దారులు, సంబంధిత శాఖల అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం సడలించిన నిబంధనల ఆధారంగా పెండింగ్‌లో ఉన్న సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

రేపు 35 మండలాల్లో వడగాలులు

APలో ఎండలు హడలెత్తిస్తున్నాయి. ఇవాళ 200 మండలాల్లో 40+ డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు APSDMA వెల్లడించింది. రేపు శ్రీకాకుళం, మన్యం, విజయనగరం, పోలవరం, ఏలూరు జిల్లాల్లోని 19 మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. మరో 35 మండలాల్లో వడగాలుల ప్రభావం ఉంటుందంది. 40-43 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయ్యే ఛాన్స్ ఉందని పేర్కొంది. అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం వేళ బయటికెళ్లొద్దని ప్రజలకు సూచించింది.