News January 23, 2025
ఉగాది నుంచి సన్న బియ్యం పంపిణీ: మంత్రి జూపల్లి

రానున్న ఉగాది పండుగ నుంచి రేషన్ షాపుల ద్వారా ప్రతి ఒక్కరికి సన్న బియ్యం పంపిణీ చేస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లు రవి, MLA మేఘారెడ్డి తెలిపారు. సల్కెలాపురం గ్రామంలో వారు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ పార్టీనే శ్రీరామరక్ష అని, నిరుపేదలకు అండగా నిలిచి ప్రభుత్వ పథకాలను ప్రతి ఇంటికి అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. అందులో భాగంగానే గ్రామ సభలు నిర్వహిస్తున్నామని తెలిపారు.
Similar News
News February 8, 2025
బిడ్డకు జన్మనిచ్చిన కమిన్స్ భార్య

ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ భార్య బెకీ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఆమెకు ‘ఈదీ’ అని పేరు పెట్టినట్లు కమిన్స్ ఇన్‌స్టా ద్వారా తెలిపారు. కమిన్స్, బెకీ దంపతులకు ఇప్పటికే ఆల్బీ ఓ కూతురు ఉంది. మరోవైపు భార్య డెలివరీ నేపథ్యంలో శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు కమిన్స్ దూరమయ్యారు. అటు గాయం కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీలోనూ అతడు పాల్గొనడం లేదు.
News February 8, 2025
విజయవాడ: సీఎం చంద్రబాబును కలిసిన శాప్ ఛైర్మన్

శాప్ ఛైర్మన్ అనిమిని రవినాయుడు ఏపీ సెక్రటేరియట్‌లో సీఎం చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. క్రీడాభివృద్ధి అంశాలపై చర్చించి, పెండింగ్‌లో ఉన్న క్రీడా ప్రోత్సాహకాల విడుదలకు కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే బడ్జెట్‌లో క్రీడలకు మరింత నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. సీఎం సానుకూలంగా స్పందించి, ప్రణాళిక సిద్ధం చేస్తే త్వరలోనే కార్యాచరణ చేపడతామని హామీ ఇచ్చారు.
News February 8, 2025
సిద్దిపేట: గ్రామాల్లో మొదలైన ‘స్థానిక’ సందడి!

ఈ నెలలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. దీంతో ఉమ్మడి మెదక్ జిల్లాలోని గ్రామాల్లో స్థానిక ఎన్నికల సందడి నెలకొంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలకు చెందిన ఆశావాహులు మంతనాలు జరుపుతున్నారు. తమకు ఈసారి అవకాశం ఇవ్వాలని గ్రామాల్లోని కొందరు ఆయా పార్టీల ముఖ్యులను కోరుతున్నారు. ఇప్పటికే పల్లెల్లో ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది.