News March 15, 2026
‘ఉగాది’ పండుగ ఎప్పుడు?

అమావాస్య గడియలు ఉండటంతో తెలుగు కొత్త సంవత్సరాది ‘ఉగాది’ ఎప్పుడు జరుపుకోవాలనే అయోమయం కొందరిలో నెలకొంది. అయితే చైత్ర శుక్ల పాడ్యమి రోజైన ఈ నెల 19(గురువారం)నే ఉగాది జరుపుకోవాలని పండితులు చెబుతున్నారు. 19న ఉదయం 6.52 గంటలకు ‘పరాభవ నామ సంవత్సరం’ మొదలవుతుందని పేర్కొంటున్నారు. అదేరోజు ఇంట్లో షడ్రుచులతో ఉగాది పచ్చడి తయారుచేసి స్వీకరించాలని సూచిస్తున్నారు.
Similar News
News April 13, 2026
పోలింగ్ కేంద్రాల్లో బయోమెట్రిక్స్.. ఈసీ, కేంద్రానికి SC నోటీసులు

ఎన్నికల నిర్వహణపై ఈసీ, కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. దొంగ ఓట్లను అరికట్టేందుకు పోలింగ్ కేంద్రాల్లో బయోమెట్రిక్ పెట్టాలంటూ BJP నేత అశ్విని కుమార్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా నోటీసులు ఇచ్చింది. అమలుపై తమ అభిప్రాయం చెప్పాలని ఆదేశించింది. అయితే ఇప్పటికిప్పుడు ఈ విధానాన్ని అమలు చేయడం సాధ్యం కాకపోవచ్చని, భవిష్యత్తులో అమలుకు వ్యవస్థలన్నీ కలిసి పనిచేయాలని SC పేర్కొంది.
News April 13, 2026
రామ్ చరణ్ అదిరిపోయే లుక్!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. ప్రముఖ మ్యాగజైన్ ‘ఎస్క్వైర్ ఇండియా’ తన ఏప్రిల్ కవర్ పేజీపై చరణ్ ఫొటోను ప్రచురించింది. డార్క్ బ్లూ కోటులో లాంగ్ హెయిర్‌తో చేతిలో కుక్కపిల్లను పట్టుకుని ఉన్న ఆయన స్టైలిష్ లుక్ ఆకట్టుకుంటోంది. ఇండియన్ సినిమా గర్వించదగ్గ నటుడిగా ఈ మ్యాగజైన్ ఆయన్ను అభివర్ణించింది. హాంకాంగ్‌లోని విక్టోరియా హార్బర్‌లో జరిగిన ఈ ఫొటోషూట్ లుక్ SMలో వైరల్ అవుతోంది.
News April 13, 2026
డీలిమిటేషన్‌పై ఏకాభిప్రాయం అవసరం: సీఎం రేవంత్

TG: మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్‌పై PM మోదీకి CM రేవంత్ ట్వీట్ చేశారు. ఈ రెండూ వేర్వేరు అంశాలన్నారు. ‘రాష్ట్రాల వారీగా అసెంబ్లీ సీట్లకు మహిళల కోటాను వెంటనే అమలు చేస్తే స్వాగతిస్తాం. జనాభా ఆధారిత డీలిమిటేషన్ జరగకుండా మహిళా రిజర్వేషన్ కోటాను వాడుకోవడం సరికాదు. ఇది BJPకి తాత్కాలికంగా లాభం చేకూర్చినా దక్షిణాదికి అన్యాయం జరుగుతుంది. డీలిమిటేషన్‌పై జాతీయ స్థాయిలో ఏకాభిప్రాయం అవసరం’ అని పేర్కొన్నారు.


