News March 21, 2024
ఉగాది పురస్కారానికి పల్నాడు ఏఆర్ అడిషనల్ SP ఎంపిక
ఉగాది పురస్కారాలకు పల్నాడు జిల్లా ఏఆర్ అడిషనల్ ఎస్పీ రామచంద్ర రాజు ఎంపికయ్యారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఉగాది పండుగ సందర్భంగా ఉత్తమ సేవలు అందించిన వారికి పురస్కారాలు అందజేస్తుంది. ఈ క్రమంలో పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి సిఫారసు మేరకు ఉత్తమ సేవలు అందించిన రామచంద్ర రాజుకు ప్రభుత్వం 2024 ఉత్తమ సేవా పురస్కారం ప్రకటించింది. ఈ సందర్భంగా బుధవారం అధికారులు, సిబ్బంది ఆయన్ను అభినందించారు.
Similar News
News December 5, 2024
మంగళగిరిలో ఎర్రచందనం పట్టివేత
మంగళగిరి మండలం కాజ టోల్ ప్లాజా వద్ద బుధవారం రాత్రి ఎర్రచందనం అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. 10 చక్రాల లారీలో ఎవరికి అనుమానం రాకుండా A4 పేపర్ బండిల్స్ మధ్యన సుమారు 50 దుంగలను దాచి తరలిస్తుండగా పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. చెన్నై నుంచి అస్సాం… అస్సాం నుంచి చైనా దేశానికి ఎర్ర చందనం దుంగలను తరలిస్తున్నట్టు ప్రాథమిక సమాచారం.
News December 5, 2024
గుంటూరు: జిల్లా స్థాయి సమన్వయ సమావేశానికి కలెక్టర్ పిలుపు
రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల ఈనెల 6 నుంచి 8వ తేదీ వరకు గ్రామస్థాయిలో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు గుంటూరు కలెక్టర్ నాగలక్ష్మీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా గురువారం ఉదయం 10.30గంటలకు జిల్లాస్థాయి సమన్వయ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ప్రజాప్రతినిధులు, రైతు సంఘాల నాయకులు, భూ సమస్యలపై పనిచేస్తున్న ఎన్జీవోలు హాజరై సలహాలు, సూచనలు ఇవ్వాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
News December 4, 2024
పశువులను సురక్షితమైన షెల్టర్లుకి తరలించాలి: కలెక్టర్
విపత్తుల సమయంలో ప్రజలతో పాటు పశువులను రక్షిత ప్రాంతాల్లోకి తరలించేలా ముందస్తుగా ఆశ్రయాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని గుంటూరుజిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి అన్నారు. బుధవారం రాష్ట్ర హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత విపత్తుల నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాగా కలెక్టర్ పాల్గొన్నారు. ప్రజలు పశువులను వదిలి పునరావాస కేంద్రాలకు రావటానికి ఆసక్తి చూపటం లేదని కలెక్టర్ తెలిపారు.