News April 24, 2025
ఉగ్రదాడిలో మన సిక్కోలు వాసి మృతి

జమ్మూ కశ్మీర్‌లో జరిగిన ఉగ్ర దాడిలో సిక్కోలు వాసి మృతి చెందాడు. అతని కుటుంబం శ్రీకాకుళంలోని ఇందిరానగర్ కాలనీలో నివాసముంటోంది. SBIలో ఉద్యోగమొచ్చాక శ్రీకాకుళం నుంచి వెళ్లి విజయనగరంతో పాటు పలు ప్రాంతాల్లో చేశారు. బ్రాంచ్ మేనేజర్‌గా ప్రమోషన్ పొంది రిటైర్డ్ అయ్యారు. కొన్నేళ్ల కిందట విశాఖలో స్థిర పడ్డారు. ఈనెల 18న మరో మూడు రిటైర్డ్ ఉద్యోగుల ఫ్యామిలీలతో కలిసి పర్యాటకానికి వెళ్లి హతులయ్యారు.
Similar News
News December 16, 2025
శ్రీకాకుళం జిల్లాలో టుడే టాప్ న్యూస్.!

➤ టెక్కలి ఇండోర్ స్టేడియంకు మహర్దశ: అచ్చెన్నాయుడు
➤ శ్రీకాకుళం జిల్లాలో 1,55,876 మందికి పోలియో చుక్కలు
➤ మత్తు పదార్దాలు అరికట్టాలి: డీఐజీ
➤ నరసన్నపేట: అక్రమ కట్టడాలపై వాడీ వేడి చర్చ
➤ బ్రాహ్మణతర్లలో ఆఖరి మజిలీకి అష్టకష్టాలు
➤ శ్రీకాకుళం రిమ్స్‌లో అన్యమత ప్రచారంపై నిరసన
➤ భార్య హత్య కేసు.. భర్తకు జీవిత ఖైదు.
News December 16, 2025
శ్రీకాకుళం జిల్లా నుంచి నియామక పత్రాలు ఎంతమంది అందుకున్నారంటే.!

శ్రీకాకుళం జిల్లా నుంచి కొత్తగా కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలను CM చంద్రబాబు నేడు మంగళగిరిలో అందించిన విషయం తెలిసిందే. శ్రీకాకుళం జిల్లా నుంచి మొత్తం 373 మంది ఎంపికైనట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో..
☛ సివిల్ కానిస్టేబుల్స్ మెన్-129
☛ కానిస్టేబుల్ ఉమెన్- 20
☛ APSP- 224 మంది ఉన్నట్లు స్పష్టం చేశారు.
News December 16, 2025
శ్రీకాకుళం జిల్లాలో 1,55,876 మంది పిల్లలకు పోలియో చుక్కలు

ఈనెల 21 నుంచి జిల్లాలో జరగనున్న పల్స్ పోలియో కార్యక్రమానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. (0-5) ఏళ్లలోపు 1,55,876 మంది పిల్లలు ఉన్నారని, ఆయా కేంద్రాల్లో పోలియో చుక్కలు వేయనున్నట్లు DMHO డాక్టర్ కే అనిత మంగళవారం తెలిపారు. అందుబాటులో లేని వారికి 22 – 25 తేదీల్లో ఇంటింటికి వెళ్లి వేస్తారన్నారు. జిల్లాలో మొత్తం 1252 పోలియో కేంద్రాలు ఉన్నాయన్నారు.


