News January 11, 2026
ఉగ్రవాదులతో పాక్ ఆర్మీ దోస్తీ.. మరోసారి బయటపడిందిలా..!

పాక్ ఆర్మీకి ఉగ్రవాదులతో ఉన్న సంబంధాలు మరోసారి బయటపడ్డాయి. పహల్గామ్ ఉగ్రదాడి మాస్టర్ మైండ్, లష్కరే తోయిబా నేత సైఫుల్లా కసూరి.. పాకిస్థాన్‌లోని ఒక స్కూల్ ఫంక్షన్‌లో ప్రసంగించడం వెలుగులోకి వచ్చింది. పాక్ ఆర్మీ తనకు ఇన్విటేషన్లు పంపుతుందని, చనిపోయిన సైనికుల అంత్యక్రియలకు తనని పిలిచి ప్రార్థనలు చేయిస్తారని బహిరంగంగానే ఒప్పుకున్నాడు. ఇండియా తనని చూస్తేనే భయపడుతుందంటూ ఈ వేదికపై విషం చిమ్మాడు.
Similar News
News January 15, 2026
మిచెల్.. టీమ్ ఇండియా అంటే చాలు..

న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ మిచెల్ టీమ్ ఇండియా అంటే చాలు శివాలెత్తుతున్నారు. వన్డేల్లో ఇండియాపై 10 ఇన్నింగ్సుల్లో 3 సెంచరీలతో 600కు పైగా రన్స్ చేశారు. 5 సార్లు 50కి పైగా పరుగులు చేశారు. సగటు 66.66గా ఉండటం విశేషం. 2023 ప్రపంచకప్ సెమీ ఫైనల్లోనూ భారత్‌పై 134 పరుగులు చేశారు. లీగ్ మ్యాచులో 130 రన్స్‌తో చెలరేగారు. ప్రస్తుతం ICC వన్డే ర్యాంకింగ్స్‌లో మిచెల్ రెండో స్థానంలో ఉన్నారు.
News January 15, 2026
జనవరి 15: చరిత్రలో ఈరోజు

✭ 1887: సంఘసంస్కర్త త్రిపురనేని రామస్వామి జననం
✭ 1929: ఆఫ్రికన్-అమెరికన్ పౌరహక్కుల ఉద్యమకారుడు మార్టిన్ లూథర్ కింగ్ జననం
✭ 1956: BSP చీఫ్ మాయావతి జననం
✭ 1967: సినీ నటి భానుప్రియ జననం
✭ 1991: సినీ నటుడు రాహుల్ రామకృష్ణ జననం
✭ భారత సైనిక దినోత్సవం
News January 15, 2026
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.


