News July 16, 2024
ఉగ్రవాదుల దాడిలో శ్రీకాకుళం జవాన్ మృతి

ఉగ్రవాదులదాడిలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన జవాన్ వీరమరణం పొందారు. నందిగం మండలం వల్లభరాయుడుపేట గ్రామానికి చెందిన సనపల జగదీశ్వరరావు(40) ఆర్మీలో పనిచేస్తున్నారు. జమ్మూకాశ్మీర్ పరిధిలోని అనంతనాగ ప్రాంతంలో నిన్న ఉగ్రవాదులను ఎదుర్కొనే క్రమంలో ఆయన ప్రాణాలు కోల్పోయారు. జవాన్ భార్య సమత దిమిలాడ సచివాలయంలో మహిళా పోలీసుగా పనిచేస్తున్నారు. ఆయనకు మోక్షప్రియ, దీక్షిత అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
Similar News
News November 24, 2025
ఎచ్చెర్ల : మూడు కోర్సుల్లో జీరో అడ్మిషన్లు

డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో ఈ ఏడాది పోస్ట్ గ్రాడ్యుయేషన్లో మూడు కోర్సులను ప్రారంభించారు. జియోఫిజిక్స్, జియాలజీ, ఫిలాసఫీ ఈ కోర్సుల్లో ఒక్క విద్యార్థి సైతం చేరలేదు. జాతీయ స్థాయిలో ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో వీటిని మూసివేసిన ఇక్కడ ప్రారంభించడంపై నిపుణులు తప్పుపట్టారు. అధికారుల అవగాహన లేక ప్రారంభించారని విద్యావేత్తలు అంటున్నారు.
News November 24, 2025
ఎచ్చెర్ల: పాలకమండలి సమావేశం ఎప్పుడో..?

డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ యూనివర్సిటీలో 2022 NOVలో పాలకమండలి చివరి సమావేశం జరిగింది. మూడేళ్లైనా..ఇప్పటికీ సమావేశం ఊసేలేదు. కనీసం ఆరు నెలలకోసారైన సమీక్ష జరగాలని విద్యావేత్తలు అంటున్నారు. పాలన, అకాడమిక్, అభివృద్ధి అంశాలపై చర్చలు జరుగుతాయి. ఈ మండలిలో ఉన్నతాధికారులు, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులతో 12 మంది ఉన్నారు. నిబంధనలు మేరకు మీటింగ్ ఏర్పాటు చేసి సమస్యలు తీర్చాలని విద్యార్థులు కోరుతున్నారు.
News November 24, 2025
నేడు ప్రజా ఫిర్యాదు నమోదు కార్యక్రమం: కలెక్టర్

ప్రజా ఫిర్యాదులు నమోదు, పరిష్కార వేదిక కార్యక్రమం శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నేడు నిర్వహించనున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఉదయం 10 గంటలకు నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి జిల్లాలోని ప్రజలు https://Meekosam.ap.gov.in వెబ్ సైట్లో ఫిర్యాదులు నమోదు చేసుకోవచ్చన్నారు.


