News August 3, 2024

‘ఉచితంగా BSNL 4G సిమ్‌కు అప్ గ్రేడ్ చేసుకోండి’

image

కర్నూలు, నంద్యాల జిల్లాల పరిధిలో సుమారు 400 సెల్ టవర్ల ద్వారా 4G సేవలను అందుబాటులోకి తీసుకొస్తామని BSNL కర్నూలు ఏరియా జనరల్ మేనేజర్ రమేశ్ శనివారం తెలిపారు. ఇప్పటికే 2G/3G సిమ్‌లు ఉపయోగిస్తున్నవారికి వారికి వారి ప్రాంతాలలో 4G సేవలను ప్రారంభించినప్పుడు అంతరాయం ఏర్పడుతుందన్నారు. వారు తమ సిమ్‌ను అప్ గ్రేడ్ చేసిన తరువాత 2G/3G/4G సేవలను పొందవచ్చన్నారు. 2G/3G సిమ్‌లను 4Gకి అప్ గ్రేడ్ చేసుకోవాలన్నారు.

Similar News

News December 3, 2025

అంగన్వాడి కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

image

కోడుమూరు మండలం గోరంట్లలో అంగన్వాడీ కేంద్రాన్ని కలెక్టర్ డా.ఏ.సిరి బుధవారం తనిఖీ చేశారు. ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారులతో కలిసి గర్భిణులకు అందిస్తున్న టేక్ హోమ్ రేషన్, పాలు, గుడ్లు, బోధన తీరును అడిగి తెలుసుకున్నారు. అంగన్వాడీ పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సిబ్బందికి సూచించారు. పిల్లలకు పౌష్టికాహారాన్ని అందించే విషయంలో శుభ్రతను పాటించాలని ఆదేశించారు.

News December 3, 2025

డ్రైవింగ్‌లో మొబైల్ వాడకం ప్రాణాంతకం: ఎస్పీ విక్రాంత్

image

డ్రైవింగ్ చేస్తూ మొబైల్ ఫోన్ వాడటం ప్రాణాంతకమని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ మంగళవారం హెచ్చరించారు. జనవరి నుంచి నవంబర్ 30 వరకు జిల్లాలో 925 మొబైల్ డ్రైవింగ్ కేసులు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ తప్పనిసరిగా ధరించి, రోడ్డు నియమాలు పాటించాలని ఎస్పీ సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.