News August 3, 2024
‘ఉచితంగా BSNL 4G సిమ్‌కు అప్ గ్రేడ్ చేసుకోండి’
కర్నూలు, నంద్యాల జిల్లాల పరిధిలో సుమారు 400 సెల్ టవర్ల ద్వారా 4G సేవలను అందుబాటులోకి తీసుకొస్తామని BSNL కర్నూలు ఏరియా జనరల్ మేనేజర్ రమేశ్ శనివారం తెలిపారు. ఇప్పటికే 2G/3G సిమ్‌లు ఉపయోగిస్తున్నవారికి వారికి వారి ప్రాంతాలలో 4G సేవలను ప్రారంభించినప్పుడు అంతరాయం ఏర్పడుతుందన్నారు. వారు తమ సిమ్‌ను అప్ గ్రేడ్ చేసిన తరువాత 2G/3G/4G సేవలను పొందవచ్చన్నారు. 2G/3G సిమ్‌లను 4Gకి అప్ గ్రేడ్ చేసుకోవాలన్నారు.
Similar News
News September 20, 2024
ముచ్చట్ల ఆలయ పూజారి కుమార్తెకు MBBSలో సీటు
బేతంచెర్ల మండలం రంగాపురానికి చెందిన ముచ్చట్ల ఆలయ పూజారి చంద్రమోహన్ రావు, వరలక్ష్మీ దంపతుల కుమార్తె ఇందు ప్రసన్నలక్ష్మీ కర్నూలు మెడికల్ కళాశాలలో MBBS సీటు సాధించింది. నీట్ ఫలితాల్లో 720 మార్కులు గాను 644 మార్కులు సాధించింది. గ్రామీణ విద్యార్థికి MBBSలో సీటు రావడం పట్ల గ్రామస్థులుచ తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.
News September 20, 2024
నేటి నుంచి 26వ తేదీ వరకు ప్రజా వేదికలు: కలెక్టర్
ప్రభుత్వం 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా సాధించిన విజయాలపై నేటి నుంచి 26వ తేదీ వరకు ప్రజా వేదికలు నిర్వహించాలని కలెక్టర్ రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు. గురువారం అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. సచివాలయ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి కరపత్రాలు, డోర్ స్టిక్కర్లను అందజేసి, కరపత్రంలోని విషయాలను ప్రజలకు వివరిస్తారని తెలిపారు.
News September 20, 2024
రాఘవేంద్రస్వామి సన్నిధిలో హీరో పూరీ ఆకాష్
మంత్రాలయం రాఘవేంద్రస్వామిని ప్రముఖ సినీ దర్శకుడు పూరీ జగన్నాథ్ కుమారుడు పూరీ ఆకాష్ గురువారం దర్శించుకున్నారు. ఆయనకు శ్రీ మఠం సహాయక పీఆర్‌ఓ హొన్నొళ్లి వ్యాసరాజాచార్, పురోహితులు కుర్డీ శ్రీపాదాచార్ స్వాగతం పలికారు. గ్రామ దేవత మంచాలమ్మను రాఘవేంద్రస్వామి మూల బృందావనాన్ని దర్శించుకొని మంగళ హారతులు స్వీకరించారు. అనంతరం శ్రీ మఠంలో జరిగిన రథోత్సవంలో పాల్గొని రథాన్ని లాగారు.