News September 19, 2024

ఉచిత ఇసుకను పారదర్శకంగా అందించేందుకు ఏర్పాట్లు: కలెక్టర్

image

శ్రీ సత్యసాయి జిల్లాలోని ఇసుక పాయింట్ల వద్ద నుంచి ఉచిత ఇసుకను పారదర్శకంగా అందించేందుకు ఏర్పాటు చేసినట్టు శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. కలెక్టర్ కార్యాలయం నుంచి గురువారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన అధికారులతో మాట్లాడారు. ఉచిత ఇసుక కోసం ప్రజలు ఆన్లైన్లో సులభతరంగా నమోదు చేసుకుని ప్రక్రియను క్రమబద్ధమైన రీతిలో రూపొందించామన్నారు.

Similar News

News December 21, 2024

అనంతపురం జిల్లాలో వరుస రోడ్డు ప్రమాదాలు

image

అనంతపురం జిల్లాలో వరుస రోడ్డు ప్రమాదాలు భయాందోళన కలిగిస్తున్నాయి. 2 నెలల వ్యవధిలో మూడు ఘోర ప్రమాదాలు జరగ్గా 18 మంది మృతి చెందారు. అక్టోబర్ 26న శింగనమల సమీపంలో ఎదురుగా వస్తున్న లారీని కారు ఢీకొట్టిన దుర్ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. నవంబరు 23న గార్లదిన్నె మం. తలగాసుపల్లె వద్ద ఆటోను RTC బస్సు ఢీకొనడంతో 8 మంది మృతి దుర్మరణం చెందారు. నేడు మడకశిర మండలంలో జరిగిన ప్రమాదంలో నలుగురు మృతిచెందారు.

News December 21, 2024

అనంతలో విషాదం.. యువకుడి సూసైడ్

image

అనంతపురంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో నివాసముండే కురుబ శివా అనే యువకుడు శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.

News December 21, 2024

ఏపీ అభివృద్ధి కి నిధులు ఇవ్వండి: పయ్యావుల

image

రాజస్తాన్‌లో కేంద్రం ఆర్థిక మంత్రి నిర్వహించిన రాష్ట్ర ఆర్ధిక మంత్రుల సమావేశంలో ఏపీ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పాల్గొన్నారు. 2025-26 కేంద్ర బడ్జెట్‌పై సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ఆర్థిక అవసరాలు, ప్రాధాన్యతా రంగాలకు అవసరమైన నిధులపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కు వివరించారు. వెనుకబడిన జిల్లాల అభివృద్ధి, చేనేత క్లస్టర్ల ఏర్పాటు, ఏవియేషన, పెట్రోల్ యూనివర్సిటీలకు నిధులు ఇవ్వాలని కోరారు.