News July 11, 2024
ఉచిత ఇసుక అనేది అబద్ధం: MLC గోవిందరెడ్డి

TDP ప్రభుత్వం చెప్పిన ఉచిత ఇసుక అనేది అబద్ధమని MLC డీసీ గోవిందరెడ్డి విమర్శించారు. ఉచిత ఇసుక మాటలకే పరిమితమైందని, చంద్రబాబు కొత్త రకం దోపిడీకి తెరలేపారన్నారు. జగన్ హయాంలో పారదర్శకంగా ఇసుకను అందజేయడంతో రూ.కోట్ల ధనం ప్రభుత్వ ఖజానాలోకి వచ్చేదన్నారు. ఇప్పుడు ఆ డబ్బంతా టీడీపీ నేతల జేబుల్లోకి వెళ్తుందని ఆరోపించారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం ప్రజల నుంచి ఒక్క రూపాయి తీసుకోకుండా ఇసుక ఇవ్వాలన్నారు.
Similar News
News February 9, 2025
కడప: 36 ఏళ్ల తర్వాత కలుసుకున్నారు

కడప జిల్లా సిద్దవటం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1987 – 88 విద్యా సంవత్సరం పూర్వ విద్యార్థుల అపూర్వ కలయిక జరిగింది. అప్పటి ఉపాధ్యాయులను వారు శాలువులతో ఘనంగా సత్కరించారు. గతంలో పాఠశాలలో తాము గడిపిన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకున్నారు. అందరము కలుసుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. ఇలా మీ బ్యాచ్‌తో మీరు కలిశారా?.
News February 9, 2025
కడప జిల్లా ప్రజలు జాగ్రత్త..!

కడప జిల్లాలో వాతావరణం మారుతోంది. వారంక్రితం వరకు జిల్లాను చలి వణికించింది. తాజాగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఫిబ్రవరి తొలివారం మే నెలను తలపించేలా ఎండ కాస్తోంది. ఉదయం 10గంటల నుంచే సూర్యూడు నిప్పులు కురిపిస్తున్నాడు. నిన్న కడప జిల్లాలో గరిష్ఠంగా 34.3డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ప్రజలు బయటకు వెళ్లినప్పుడు జాగ్రత్తలు పాటించాలని, తగిన మోతాదులో నీరు, కొబ్బరి నీళ్లు తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు.
News February 9, 2025
పులివెందులలో పులి కలకలం.. వాస్తవం ఇదే.!

పులివెందుల మండలం నల్లపురెడ్డిపల్లి గ్రామంలో పులి అడుగులు కనిపించాయని వార్తలు వచ్చాయి. విషయం తెలుసుకున్న ఫారెస్ట్, పోలీస్ అధికారులు శనివారం రాత్రి పొలాల్లో పర్యటించారు. గ్రామస్థులతో కలిసి పులి సంచరిస్తుందని చెప్పిన ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఆ అడుగులు పులివి కావని నిర్ధారించారు. ఈ తనిఖీల్లో సీఐ నరసింహులు, ఫారెస్ట్ అధికారి శ్రీనివాసులు అటవీ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.