News November 26, 2024
‘ఉచిత కోచింగ్ కోసం ఈనెల 30లోగా దరఖాస్తు చేసుకోవాలి’
విదేశాలకు వెళ్లి చదవాలనుకునే మైనార్టీ విద్యార్థుల కోసం IELTS, GRE, TOFEL పరీక్షలకు తెలంగాణ మైనార్టీ స్టడీ సర్కిల్ HYD ఆధ్వర్యంలో ఉచిత కోచింగ్ ఇవ్వనున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి కె.సత్యనారాయణ తెలిపారు. ఆసక్తి, అర్హత గల జిల్లా మైనార్టీ అభ్యర్థులు తమ దరఖాస్తులను ఈనెల 30 లోపు తెలంగాణ మైనార్టీ స్టడీ సర్కిల్ HYD లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
Similar News
News December 6, 2024
రాత్రి ఖమ్మంలో రోడ్డు ప్రమాదం UPDATE
ఖమ్మంలో నిన్న రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో <<14801070>>ఇద్దరు <<>>చనిపోయిన విషయం తెలిసిందే. పోలీసుల వివరాల ప్రకారం.. తిరుమలాయపాలెం మండలం పడమటితండాకు చెందిన శివరాజు(18), హర్షవర్ధన్(15) ఉదయం బైక్‌పై ఖమ్మం వచ్చారు. తిరుగు ప్రయాణంలో వీరి బైక్‌ను RTC బస్సు ఢీకొంది. ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.
News December 6, 2024
రామాలయం అభివృద్ధికి రూ.63 కోట్లు: ఎమ్మెల్యే తెల్లం
భద్రాద్రి రామాలయం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.63 కోట్లు మంజూరు చేసిందని ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు తెలిపారు. అటు ఇప్పటికే దీనికి సంబంధించి భూసేకరణ పనులు జరుగుతున్నాయని గురువారం నిర్వహించిన సమావేశంలో చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందన్నారు. అటు రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై నాయకులు విస్తృతంగా ప్రజలకు అవగాహన కల్పించాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
News December 6, 2024
కోటిమంది మహిళల్ని కోటీశ్వరుల్ని చేయడమే లక్ష్యం: భట్టి
మహిళల్ని కోటీశ్వరుల్ని చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. పాఠశాలల విద్యార్థులకు యూనిఫామ్స్ కుట్టే అవకాశం స్థానిక మహిళలకే ఇస్తున్నామని ఆయన తెలిపారు. డ్వాక్రా సంఘాల్లోని మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు శిల్పారామంలో వారు తయారు చేసిన ఉత్పత్తులు అమ్ముకునేందుకు అవకాశం కల్పిస్తున్నామని ఆయన వెల్లడించారు.