News March 9, 2025
ఉచిత బస్సు తుస్సు.. గ్యాస్ సిలిండర్లు. బుస్సు: కాకాణి

ఉచిత బస్సు తుస్సు – గ్యాస్ సిలిండర్లు బుస్సు అని టీడీపీ సూపర్ సిక్స్ పథకాలపై మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి సెటైర్లు వేశారు. పొదలకూరు మండలంలో ఆయన శనివారం పర్యటించారు. కూటమి పాలన బాగా లేదంటే కాకాణి సమక్షంలో ప్రజలు పెదవి విరిచారు. చంద్రబాబుకి మోసం చేయడంతోనే కలిసి వస్తుందని కాకాణి ఎద్దేవా చేశారు.
Similar News
News March 10, 2025
నెల్లూరు: పెళ్లి మండపంలో క్రికెట్ మ్యాచ్ లైవ్

పెళ్లి వేడుకల్లో చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌ను ప్రత్యక్ష ప్రసారం చేసిన ఘటన నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే.. రామలింగాపురంలోని ఓ కళ్యాణ మండపంలో వధూవరులు వినూత్నంగా అతిథుల కోసం ఇండియా న్యూజీలాండ్ క్రికెట్ మ్యాచ్ లైవ్ ప్రసారాన్ని ఏర్పాటు చేశారు. బంధుమిత్రులు పెళ్లి వేడుకల్లోనే మ్యాచ్‌ను వీక్షించారు. వధూవరులు క్రికెట్‌పై తమ ప్రేమను ఇలా చాటుకున్నారని పలువురు ప్రశంసించారు.
News March 10, 2025
పొదలకూరు నిమ్మ యార్డుకు మంగళవారం సెలవు

హోలీ పర్వదినం సందర్భంగా పొదలకూరులోని ప్రభుత్వ నిమ్మ యార్డుకు మంగళవారం సెలవును ప్రకటిస్తూ అసోసియేషన్ తీర్మానం చేసింది. ఉత్తరాది రాష్ట్రాల్లో హోలీ పండుగను ఘనంగా నిర్వహిస్తారని, ఇందులో భాగంగా వ్యాపార లావాదేవీలకు సుముఖత చూపించరన్నారు. ఇందుకోసం యార్డ్‌కు సెలవు ప్రకటించినట్లు తెలిపారు. ఈ విషయాన్ని యార్డ్ పరిధిలోని పరిసర ప్రాంతాల నిమ్మ రైతులు గమనించాలని కోరారు.
News March 9, 2025
నెల్లూరు: టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బీద రవిచంద్ర

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా బీద రవిచంద్ర పేరును టీడీపీ ఖరారు చేసింది. ఈయన కావలి నియోజకవర్గం అల్లూరు(M) ఇస్కపల్లిలో జన్మించారు. గతంలో ఆయన నెల్లూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా, ఆక్వా అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. 2015లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఈయన సోదరుడు బీద మస్తాన్‌రావు టీడీపీ నుంచి రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు.