News November 28, 2024

ఉచిత బూడిద వివాదం: జేసీ, ఆదిలకు CM పిలుపు

image

జమ్మలమడుగు MLA ఆదినారాయణరెడ్డి, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిల మధ్య ఫ్లైయాష్ వివాదం నేపథ్యంలో ఇరువురి నేతలకూ CM చంద్రబాబు నుంచి పిలుపు వచ్చింది. ఇవాళ అమరావతికి వచ్చి తనను కలవాలని ఆదేశించినట్లు సమాచారం. మరోవైపు ఈ ఉచిత బూడిద వివాదంపై జిల్లా అధికారుల నుంచి సీఎం వివరాలను తెలుసుకున్నారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా నేతల వ్యవహారం ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Similar News

News November 27, 2025

భారీ సైబర్ మోసాన్ని ఛేదించిన పులివెందుల పోలీసులు

image

డిజిటల్ అరెస్ట్ పేరుతో వృద్ధుడిని భయపెట్టి రూ.1.62 కోట్లు దోచుకున్న అంతర్రాష్ట్ర గ్యాంగ్‌లో ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ తెలిపారు. నిందితుల దగ్గర నుంచి రూ.1,05,300 నగదు, 4 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ముంబై సీబీఐ అధికారులుగా నటిస్తూ వాట్సాప్‌లో బెదిరించినట్లు మీడియాకు తెలిపారు. ఇంతటి భారీ మోసాన్ని ఛేదించిన పులివెందుల పోలీసులను ఎస్పీ అభినందించారు.

News November 27, 2025

ప్రొద్దుటూరులో నేటి బంగారు, వెండి ధరలు

image

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో నిన్నటి కన్నా ఇవాళ బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. గురువారం బంగారం, వెండి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
☛ బంగారం 24 క్యారెట్ల 1 గ్రాము ధర: రూ.12,550
☛ బంగారం 22 క్యారెట్ల 1 గ్రాము ధర: రూ.11,546
☛ వెండి 10 గ్రాములు: రూ.1662.00

News November 27, 2025

కడప జిల్లాలో రూ.22.75 కోట్లు మాయం?

image

కడప జిల్లాలో పేజ్-3 ఇళ్ల నిర్మాణాలకు లబ్ధిదారుల నుంచి వసూలు చేసిన డబ్బులు కనిపించడం లేదు. అప్పట్లో ప్రతి ఇంటికి పునాదుల కోసం రూ.35 వేలు వసూలు చేశారు. నిర్మాణాలు మొదలవ్వని 6,501 ఇళ్లకు సంబంధించి సుమారు రూ.22.75 కోట్లు స్వాహాపై ఇటీవల పరిశీలన చేపట్టారు. జిల్లాలో 16,765 ఇళ్లు మంజూరయ్యాయి. ఇందులో 10,264 ఇళ్ల నిర్మాణాలు మాత్రమే ప్రారంభమయ్యాయి. మిగతా 6,501 ఇళ్లు ప్రారంభం కాలేదు. దీనిపై విచారణ చేపట్టారు.