News January 22, 2025
ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగపరచుకోవాలి

హుజూర్నగర్లోని టౌన్ హాల్లో బుధవారం పాస్టర్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో మెగా ఉచిత గుండె, కిడ్నీ, ఎముకల వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఐఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎరగాని నాగన్న గౌడ్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అయన సూచించారు.
Similar News
News November 17, 2025
ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం వద్దు: ఇలా త్రిపాఠి

నల్గొండ కలెక్టరేట్లో సోమవారం మొత్తం 129 ఫిర్యాదులు అందాయి. 73 పిర్యాదులు జిల్లా అధికారులకు, 56 రెవెన్యూ శాఖకు సంబంధించినవి వచ్చాయి. ప్రజావాణి ఫిర్యాదులను జాప్యం లేకుండా పరిష్కరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారంపై జిల్లా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం చేయవద్దన్నారు. ఎప్పటి ఫిర్యాదులు అప్పుడే పరిష్కరించాలన్నారు.
News November 17, 2025
చలికి గజ గజ.. మంటలతో ఉపశమనం..!

నల్గొండ జిల్లాలో గత కొద్ది రోజులుగా ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. సాయంత్రం 6 గంటల నుంచి చల్లని గాలులు వీచడం ప్రారంభమై తెల్లవారుజామున 4 నుంచి 6 గంటల మధ్య అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా పల్లె ప్రాంతాల్లో ఈ చలి ప్రభావం అధికంగా ఉంది. అనేక చోట్ల చలి నుంచి ఉపశమనం పొందడానికి గ్రామాలలో ఎక్కువ శాతం మంటలు వేసుకుంటున్నారు.
News November 17, 2025
సమ్మె వద్దు.. సమస్యలు పరిష్కరిస్తాం: నల్గొండ కలెక్టర్

పత్తి రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని జిన్నింగ్ మిల్లుల యాజమాన్యాలు సమ్మె విరమించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిన్నింగ్ మిల్లుల యజమానుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని తెలిపారు. ఇదిలా ఉండగా తాము రాష్ట్ర అసోసియేషన్తో మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని జిన్నింగి మిల్లుల యజమానులు కలెక్టర్కు తెలిపారు.


