News March 23, 2025

ఉచిత సామూహిక వివాహాలు: రఘువీరా రెడ్డి

image

మడకశిర మండల పరిధిలోని నీలకంఠాపురం గ్రామంలో శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించే సామూహిక ఉచిత వివాహాలకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని మాజీ మంత్రి రఘువీరారెడ్డి పేర్కొన్నారు. ఏప్రిల్ 4వ తేదీలోపు నీలకంఠాపురంలో తమ వివరాలు నమోదు చేసుకోవాలన్నారు. మహిళలకు 18, పురుషులకు 21సంవత్సరాల వయసు నిండినట్లు ఆధారాలను అందజేయాలన్నారు. శాస్త్రోక్తంగా వివాహాలు నిర్వహిస్తామని రఘువీరారెడ్డి తెలిపారు.

Similar News

News March 31, 2025

వరల్డ్ తెలుగు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కౌన్సిల్ కార్యదర్శిగా ఈవీ శ్రీనివాస్

image

వరల్డ్ తెలుగు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కౌన్సిల్(WTITC) గౌరవ కార్యదర్శి, సలహాదారుడిగా హనుమకొండకు చెందిన సామాజికవేత్త ఈ.వి.శ్రీనివాస్ రావును సంస్థ స్థాపకుడు సందీప్ మక్తాలా నియమించారు. ఈ సందర్భంగా ఈ.వీ శ్రీనివాస్ రావు మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ శాఖా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు నాయకత్వంలో తెలుగు ప్రజల ఐటీ రంగ పురోగతికి అంకితభావంతో కృషి చేస్తానని పేర్కొన్నారు.

News March 31, 2025

CBG ప్లాంట్లు.. ఎకరానికి రూ.31వేల కౌలు: గొట్టిపాటి

image

APలో 500 కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ల ఏర్పాటుకు రిలయన్స్ ముందుకొచ్చిందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ఎల్లుండి కనిగిరిలో CBG తొలి యూనిట్‌కు అనంత్ అంబానీ, లోకేశ్ శంకుస్థాన చేస్తారన్నారు. త్వరలో మార్కాపురం, గిద్దలూరు, దర్శిలోనూ ప్రారంభిస్తామని చెప్పారు. ప్లాంట్ల ఏర్పాటుకు ప్రభుత్వ భూమికి ఎకరానికి రూ.15వేలు, ప్రైవేట్ భూమికి రూ.31వేల కౌలు అందిస్తామని పేర్కొన్నారు.

News March 31, 2025

MBNR: ‘అంబేడ్కర్ జాతర విజయవంతం కావాలి’

image

మహబూబ్‌నగర్ పట్టణంలోని ఎంబీసీ మైదానంలో నిర్వహించనున్న పూలే – అంబేడ్కర్ జాతర పోస్టర్‌ను మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఈరోజు ఆవిష్కరించారు. పూలే -అంబేడ్కర్ జాతర విజయవంతం కావాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బోయపల్లి నర్సింహులు, వేంకట స్వామి, సామెల్, సిరసనోళ్ల బాలరాజు, గువ్వ లక్ష్మణ్ తదితరులున్నారు.

error: Content is protected !!