News March 15, 2025
ఉచిత DSC శిక్షణకు నేడే తుది గడువు

తిరుపతి జిల్లాలో SC, ST అభ్యర్థులకు ఉచిత DSC కోచింగ్ కోసం దరఖాస్తులకు నేటి(శనివారం) వరకు అవకాశం ఉన్నట్లు జిల్లా ఎస్సీ సంక్షేమ, సాధికారత అధికారి విక్రమ్ కుమార్ రెడ్డి తెలిపారు. గతంలో దరఖాస్తు చేసుకున్న వాటిని పరిగణలోకి తీసుకుంటున్నామని ఆయన వెల్లడించారు. వారితో పాటూ బీసీలకు కూడా అవకాశం ఉందని బీసీ వెల్ఫేర్ అధికారి జోత్స్న తెలిపారు. అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించాలని వారు కోరారు.
Similar News
News November 4, 2025
కొండ చుట్టూ గ్రామాలకు వెలుగునిచ్చే గండ దీపం!

భూపాలపల్లి జిల్లా తిరుమలగిరి శివారు బుగులోని వెంకన్న స్వామి జాతరలో గండ దీపం బ్రహ్మోత్సవాలు పూర్తయ్యే వరకు వెలుగుతూ ఉంటుంది. మంగళవారం ఈ గండ దీపాన్ని వెలిగించి, 5 రోజుల పాటు పూజలు నిర్వహిస్తారు.ఈ దీపం వెలుగు కొండ చుట్టూ ఉన్న గ్రామాలకు కాంతితో విరజిల్లుతుంది. భక్తులు వెంకన్న స్వామిని స్మరిస్తూ, ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ఇక్కడికి చేరుకుంటారు. ఈ దీపంలో నూనె పోసి కోరికలు కోరుకోవడం ఆనవాయితీగా వస్తోంది.
News November 4, 2025
BCలకు వెన్నుదన్నుగా ఆదరణ 3.0: సవిత

AP: BCల సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమని మంత్రి సవిత పేర్కొన్నారు. ఆదరణ 3.0 పథకం అమలుపై వర్క్ షాప్ను ప్రారంభించారు. ‘BCలు సమిష్టిగా కూటమిని గెలిపించారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో వారెంతో నష్టపోయారు. మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే BCలకు బడ్జెట్లో అత్యధికంగా నిధులు కేటాయించాం. వారి కాళ్లపై వారు నిలబడాలని ఆదరణ 3.0 పథకం అమలు చేస్తున్నాం. దానికి బడ్జెట్లో రూ.1000 కోట్లు కేటాయించాం’ అని తెలిపారు.
News November 4, 2025
TU: సత్ఫలితాలనిస్తున్న బయోమెట్రిక్ హాజరు

తెలంగాణ యూనివర్సీటీలో ఇటీవల పకడ్బందీగా చేపట్టిన బయోమెట్రిక్ హాజరు విధానం సత్ఫలితాలనిస్తోంది. ఉన్నత విద్యాశాఖ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్న వర్సిటీ అధికారులు ఎవరినీ ఉపేక్షించడం లేదు. తప్పనిసరిగా ఉదయం, సాయంత్రం సమయానుసారంగా బయోమెట్రిక్ ఇవ్వాల్సిందేనని, నిబంధనలు పాటించని అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది జీతాల్లో కోతలు విధిస్తోంది. బయోమెట్రిక్ హాజరు లేని సిబ్బంది సాధారణ సెలవులను భారీగా కోత విధించింది.


