News June 29, 2024
ఉట్నూర్: అధికారులతో ఐటీడీఏ పీఓ సమావేశం
ప్రధానమంత్రి జన జాతీయ న్యాయ మహా అభియాన్ పథకాన్ని త్వరితగతిన పూర్తిచేయాలని ఐటీడీఏ పీఓ ఖుష్బూ గుప్తా ఆదేశించారు. శుక్రవారం కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. పథకం అర్హులైన లబ్ధిదారులకు ఆధార్, క్యాస్ట్ సర్టిఫికెట్, మొబైల్ నంబర్లను 15 రోజుల్లో కచ్చితంగా పూర్తిచేయాలని ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల మండల తహసిల్దార్లను ఆదేశించారు. ఐటీడీఏ కోర్ట్ కేసులపై ప్రత్యేకదృష్టి సారించాలన్నారు.
Similar News
News October 4, 2024
ఆదిలాబాద్: ఏకంగా భాష నేర్చుకుని జాబ్ కొట్టింది..
ఉట్నూరు మండలం లక్కారం మసీదు ఏరియాలో నివాసముండే న్యాయవాది పవార్ వసంత్ కూతురు మౌనిక డీఎస్సీ ఉర్దూ మాధ్యమంలో ఎస్జీటీగా ఎంపికయ్యారు. ఇంటి చుట్టూ ఉన్న ముస్లింలతో ఉర్దూ భాషలో మాట్లాడటం చేసుకున్న ఆ యువతికి ఆ భాషే చివరకు ఉద్యోగాన్ని సాధించిపెట్టింది. ఎస్టీ విభాగంలో రెండు పోస్టులు రిజర్వు చేయడంతో ఆమెకు ఉద్యోగం దక్కడం లాంఛనమే. ఉర్దూ భాషను మిత్రులతో పాటు యూట్యూబ్ సాయంతో నేర్చుకున్నట్లు మౌనిక తెలిపారు
News October 4, 2024
ఆదిలాబాద్: వెబ్ అప్షన్స్ పెట్టుకోవడానికి నేడే LAST
ఆదిలాబాద్ ప్రభుత్వ ఆర్ట్స్ కామర్స్ డిగ్రీ కళాశాలలో 2024-25 విద్యా సంవత్సరానికి గాను పీజీ M.A ఎకనామిక్స్ M.Com రెగ్యులర్ కోర్సులలో రెండవ విడతలో వెబ్ ఆప్షన్ పెట్టుకోవడానికి ఈనెల 4వ తేదీవరకు గడువు ఉందని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ అతీక్ బేగం కోఆర్డినేటర్ చంద్రకాంత్ తెలిపారు. CPGET రాసిన విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు. ఇతర వివరాలకై కళాశాలను సంప్రదించాలని కోరారు.
News October 4, 2024
ఆదిలాబాద్: ఈనెల 5న అంతర్జాతీయ ఉద్యోగ మేళా
ఆదిలాబాద్ ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఈనెల 5న అంతర్జాతీయ ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ తెలిపారు. తెలంగాణ ఓవర్సీస్ మాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్, తెలంగాణ ప్రభుత్వ, ఉద్యోగ, శిక్షణ విభాగం ఆధ్వర్యంలో ఈ ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. 21 నుంచి 41 ఏళ్లలోపు ఉండి పదో తరగతి ఉత్తీర్ణులైన వారు, ద్విచక్ర వాహన డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవారు అర్హులన్నారు.