News November 17, 2024

ఉట్నూర్: ఆవుపై దాడి చేసిన పెద్దపులి

image

అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలో పెద్దపులి కలకల రేపుతోంది. తాజాగా శనివారం సాయంత్రం ఉట్నూర్ మండలంలోని గంగాపూర్ గ్రామ పంచాయతీలోని వంక తుమ్మ గ్రామ సమీపంలో ఓ ఆవుపై దాడి చేసింది. దీంతో ఆవు స్వల్ప గాయాలయ్యాయి. దీంతో మండలంలోని పలు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Similar News

News March 13, 2026

ఆదిలాబాద్: ఉచితంగా వెజిటబుల్ కిట్ల పంపిణీ

image

వెజిటబుల్ మినీ కిట్లను గురువారం జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా ఉద్యాన శాఖ ద్వారా రైతులకు ఉచితంగా అందిస్తున్న కిట్లను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆర్గానిక్ వ్యవసాయానికి ప్రోత్సహించడానికే ఉచిత కిట్లను అందిస్తున్నామన్నారు.

News March 13, 2026

ఖచ్చితత్వంతో పూర్తి చేయాలి: ADB కలెక్టర్

image

హౌస్‌ లిస్టింగ్, హౌసింగ్ సెన్సస్ ప్రక్రియను పారదర్శకంగా, ఖచ్చితత్వంతో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షిషా అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ​ ‘జనగణన-2027’లో భాగంగా ‘హౌస్‌లిస్టింగ్, హౌసింగ్ సెన్సస్’ ప్రక్రియపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. పట్టణ ప్రాంతాల్లో వార్డుల విభజన, స్లమ్ ఏరియాల గుర్తింపు, జియో-ట్యాగింగ్ ప్రక్రియను నిశితంగా చేపట్టాలన్నారు.

News March 12, 2026

ADB: ఉచిత శిక్షణ.. APPLY NOW

image

టాస్క్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉచిత నైపుణ్య శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. సీ, జావా, పైథాన్, వెబ్ డెవలప్‌మెంట్, సాఫ్ట్ స్కిల్స్‌లో శిక్షణ ఇవ్వనున్నారు. గ్రాడ్యుయేట్లు, ఫైనలియర్ విద్యార్థులు అర్హులు. మార్చి 16లోగా ఆధార్, పాన్ కార్డ్, సర్టిఫికెట్లతో దరఖాస్తు చేసుకోవాలి. మరిన్ని వివరాలకు 9502786438 నంబర్‌ను సంప్రదించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా సూచించారు.